ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకై నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ), డీఎస్సీ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న సుమారు ఆరు (6) లక్షల మంది అభ్యర్థులకు శుభవార్త.
AP రాష్ట్రంలో గడిచిన కొన్ని ఏళ్ల నుండి టెట్ పరీక్ష మరియు డీఎస్సీ పరీక్షలపై పాఠశాల విద్యా శాఖ నుండి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో లక్షలాది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల మనస్సులలో టెట్ మరియు డీఎస్సీ పరీక్షలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ తరుణంలోనే తాజాగా లక్షలాది మంది అభ్యర్థులకు ఒక శుభవార్తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించినది.
రాబోయే ఆగష్టు నెలలో ఏపీ లో టీచర్ ఎలిజిబిలీటీ టెస్ట్ (టెట్ -2022) పరీక్షను నిర్వహించబోతున్నట్లు ఏపీ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుండి అధికారిక సమాచారం వచ్చింది.
ఈ టెట్ - 2022 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ను అతి త్వరలోనే విడుదల చేయడానికి ఏపీ విద్యా శాఖ తమ తమ ప్రణాళికలను రచిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఆగష్టు నెలలో టెట్ పరీక్షల నిర్వహణ, ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకు నిర్వహించే డీఎస్సీ పరీక్షలపై ఏపీ ఎడ్యుకేషనల్ డిపార్టుమెంటు తమ దృష్టిని సారించబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఈ సారి టెట్ పరీక్షలలో క్వాలిఫై అయినా అభ్యర్థులకు టెట్ సర్టిఫికెట్ కు లైఫ్ టైమ్ వాలిడిటీ లభించడం అభ్యర్థులకి ఒక వరం లాంటి విషయం అని మనం చెప్పవచ్చు.
ఈ టెట్ మార్కులలో అభ్యర్థులకి వచ్చిన మార్కులకు డీఎస్సీ పరీక్షలో 20% వెయిటేజ్ ఇవ్వడం ఇక్కడి ముఖ్యమైన అంశంగా అభ్యర్థులు తమ జ్ఞప్తిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
టెట్ మరియు డీఎస్సీ పరీక్షల నిర్వహణలపై ఏపీ ప్రభుత్వం నుండి కీలకమైన సమాచారం వస్తున్న ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు వెంటనే మీ మీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ను మొదలు పెట్టడం మంచిది అని మనం చెప్పుకోవచ్చు.
0 Comments