Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RTC Latest Update : RTC లో ఖాళీల భర్తీ, నెలకి 22,000

తెలంగాణ స్టేట్ బోర్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ మరియు డిప్లొమా అప్ప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీనకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అప్ప్రెంటీస్ షిప్ పోస్టులు.

2). భారీ సంఖ్యలో ఖాళీల భర్తీ.

3). భారీ స్థాయిలో స్టై ఫండ్స్.

4). ఈ అప్ప్రెంటీస్ షిప్ ల కాలవ్యవధి 3 సంవత్సరాలు  ఉండబోతుంది.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ రీజియన్స్ లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది   :  జూన్  15, 2022

పోస్టులు వివరాలు   :

అప్ప్రెంటీస్ (గ్రాడ్యుయేట్ /టెక్నీషియన్ )    -   300

రీజియన్ల వారీగా ఖాళీలు   :

పోస్ట్ లు ఖాళీలు
హైదరాబాద్ 51
సికింద్రాబాద్ 36
మహబూబ్ నగర్ 27
మెదక్ 24
నల్గొండ 21
రంగా రెడ్డీ 21
ఆదిలాబాద్ 18
కరీంనగర్ 30
ఖమ్మం 18
నిజామాబాద్ 18
వరంగల్ 27
ఎన్ఓయూస్ 9

మొత్తం ఖాళీలు   :

300 ఖాళీలను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు   :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఏదైనా విభాగాలలో బీఈ/బీటెక్ / డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆటో మొబైల్ /మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలలో గ్రాడ్యుయేట్ /డిప్లొమా హోల్డర్స్ కు ప్రాధాన్యత ఇవ్వబడును అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు   :

18-35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతల మార్కులు, పెర్సెంటేజ్ ల ఆధారంగా మరియు షార్ట్ లిస్ట్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్స్  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 16,000 రూపాయలు నుండి 22,000 రూపాయలు వరకూ స్టై ఫండ్స్ లభించనున్నాయి.

Website

Apply Link

Notification

Apply Link 2

Post a Comment

0 Comments