ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రముఖ సంస్థల నుంచి 700 కు పైగా పోస్టుల నియామకానికి తాజాగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులు అనేవి యాక్సిస్ బ్యాంక్ మరియు ప్రముఖ కంపెనీ అయిన హిటేరో డ్రగ్స్ లిమిటెడ్ నుంచి భర్తీ చేయడం జరుగుతుంది.
ఈ పోస్టులను కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలకు సంభదించి మరిన్ని వివరాలు సవిరంగా తెలుసుకుందాము.
ముఖ్యమైన అంశాలు:
1).ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక.
2).ఎటువంటి వ్రాత పరీక్ష లేదు.
3).భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ.
4). ఆకర్షనీయమైన వేతనం.
5).ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ: 20 జూన్ 2022
హిటేరో డ్రగ్స్ లిమిటెడ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ: 21 జూన్ 2022
మొత్తం ఖాళీలు:
యాక్సిస్ బ్యాంక్ పోస్టులకు సంభందించి మొత్తం 75 ఖాళీలు అనేవి విడుదల చేయడం జరిగింది.
హిటేరో డ్రగ్స్ లిమిటెడ్ ఉద్యోగాలకు సంభందించి మొత్తం 650 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
యాక్సిస్ బ్యాంక్ లో విభాగాల వారీగా
రిలేషన్షిప్ ఆఫీసర్ - 75 పోస్టులు కలవు.
హిటేరో డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీలో విభాగాల వారీగా
క్వుసి/క్వుఏ పోస్టులు -100
ప్రొడక్షన్ పోస్టులు -200
మెయింటెనెన్స్ పోస్టులు -200
వర్ హౌస్ - 50
టి.ఎస్డి/సేఫ్టి - 100
మొత్తం 650 పోస్టులు కలవు.
అర్హతలు:
రిలేషన్షిప్ ఆఫీసర్ పోస్టులకు ఏదయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి ఇంటర్ /డిగ్రీ అర్హత అనేది కలిగి ఉండాలి.
హిటేరో డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీలో పోస్టులకు 2019నుంచి 2022 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకునే అవకాశం కలదు.
క్వుసి/క్వుఏ పోస్టులకు ఏదయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా ఎమ్మెసి కెమిస్ట్రీ/బి.ఎం ఫార్మసి కోర్స్ చేసి వుండాలి.
ప్రొడక్షన్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి బి.ఎస్సి కెమిస్ట్రీ పూర్తీ చేసి ఉండాలి.
మెయింటెనెన్స్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి డిప్లొమా లో మెకానికల్ ఇంజనీరింగ్/ఐ.టి.ఐ ఫిట్టర్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు
వర్ హౌస్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా బి.కాం /బి.ఎ చేసిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం కలదు.
టి.ఎస్డి/సేఫ్టి పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి కెమికల్ విభాగాలలో బి.టెక్ పూర్తీ చేసి ఉండాలి.
వయసు:
యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 35 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.
హిటేరో డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 27 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.
జీతం వివరాలు :
యాక్సిస్ బ్యాంక్ లో ఉద్యోగాలకు జీతం అనేది నెలకు 12,256/-రూపాయలు మరియు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది.
హిటేరో డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీలో సంవత్సరానికి 1.8 లక్షల నుంచి 2.10 లక్షల రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
జాబ్ లోకేషన్:
యాక్సిస్ బ్యాంక్ లో ఉద్యోగాలకు సంబందించి జాబ్ అనేది విశాఖపట్నం/విజయనగరం/శ్రీకాకుళం/కాకినాడ/రాజమండ్రి లో పనిచెయాల్సి వుంటుంది.
హిటేరో డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు సంభందించి జాబ్ అనేది నక్కపల్లి/హైద్రాబాద్ లో పనిచెయాల్సి వుంటుంది.
ఇంటర్వ్యూ నిర్వహించు స్థలం :
యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ అనేది డో.నెంబర్ 43-16-23 , సుబ్బలక్ష్మి నగర్ ఆపొసిట్ బాట షౌరూమ్, ఎబౌ ఇండియన్ బ్యాంక్, దొందపర్థి- విశాఖపట్నం నిర్వహించుచున్నారు.
హిటేరో డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అనేవి డాక్టర్ వి.ఎస్. కృష్ణ కాలేజీ, మద్దెలపాలెమ్ - విశాఖపట్నం
ఫీజు వివరాలు:
ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
0 Comments