Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Singareni Collieries Jobs : జీతం 29,460 సింగరేణి కొలిరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి తాజాగా నోటిఫికేషన్‌

సింగరేణి కొలిరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది. 

జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి.

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరని కేవలం వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మరిన్ని వివరాలు సవిరంగా తెలుసుకుందాము.


ముఖ్యమైన అంశాలు:

1).ఇవి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు.

2).భారీ స్థాయిలో వేతనాలు.

3).భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ.

4).వ్రాత పరిక్ష ద్వారా ఎంపిక.

5).రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ అర్హులే.

6).ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అదే విధంగా అర్హత కలిగిన ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 20 జూన్ 2022

ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి ఆఖరి తేది      : 10 జులై 2022

పోస్టు యొక్క పేరు :

జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు.

మొత్తం పోస్టుల సంఖ్య :

సింగరేణి కొలిరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి మొత్తం 177 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు :

యు.ఆర్ కేటగిరి అభ్యర్థులకు - 08 పోస్టులు

లోకల్ పోస్టులు                       -    169

ఒ.సి - 36, ఒ.సి.డబ్ల్యూ -22, ఇ.డబ్ల్యూ.ఎస్ - 11, ఇ.డబ్ల్యూ. ఎస్.డబ్ల్యూ - 05, పి.డబ్ల్యూ.డి - 05, పి.డబ్ల్యూ.డి.డబ్ల్యూ - 01, బి.సి.ఎ.-08, బి.సి.ఎ.డబ్ల్యూ -03,బి.సి.బి -11, బి.సి.బి.డబ్ల్యూ - 08, బి.సి.సి -01, బి.సి.డి -08, బి.సి.డి.డబ్ల్యూ - 03,బి.సి.ఇ.-07, బి.సి.ఇ.డబ్ల్యూ -01,ఎస్సి-20, ఎస్సి.డబ్ల్యూ - 10,ఎస్టీ -06, ఎస్టీ.డబ్ల్యూ -03

ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్:

ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి బ్యాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. మరియు 6 నెలల కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ 

( లేదా ) 

డిప్లొమా లో లేదా బ్యాచిలర్ డిగ్రీ లో కంప్యూటర అప్లికేషన్స్ / ఇన్ఫర్మేషన్ అనేది ఒక సబ్జెక్ట్ గా ఉండాలి.

వయస్సు:

ఈ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంభందించి వయసు అనేది 01/01/2022 వ తేదీ నాటికి 30 సంవత్సరాల వయసు ఉండాలి.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్టీ/ఎస్సి అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఎక్స్ - సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి కలదు.

జీతం వివరాలు:

సింగరేణి కొలిరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి విడుదల అయిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంభందించి జీతం అనేది నెలకు 29,460/-రూపాయల వరకూ ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.

ఏ విధంగా అప్లై చేసుకోవాలి :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చెసుకొవాల్సి ఉంటుంది.

ఫీజు వివరాలు :

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ కూడా 100/-రూపాయల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మరియు 300/-రూపాయలు ఎగ్జామినెషన్ ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది.

ఎస్టీ/ఎస్సి అభ్యర్థులు మరియు సింగరేణి కొలిరీస్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగులు కేవలం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఫీజు చెల్లించవలసిన విధానం :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు

 అందరూ కూడా ఆన్లైన్ విధానంలో ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది.

* డెబిట్ కార్డు

* క్రెడిట్ కార్డు

* ఇంటర్ నెట్ బ్యాంకింగ్

* యు.పి.ఐ.పేమెంట్

ఎంపిక విధానం:

ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఈ పోస్టులను భర్తికి చెయనున్నారు. 

పరీక్ష లో ఒ.సి/ఇ.డబ్ల్యూ. డి/పి.డబ్ల్యూ. డి అభ్యర్థులకు 30 శాతం మార్కులు మరియు బి.సి అభ్యర్థులకు 20 శాతం మార్కులు మరియు ఎస్టీ/ఎస్సి అభ్యర్థులకు 15 శాతం మార్కులు ద్వార ఎంపిక చేయనున్నారు.

పరీక్షా విధానం:

ఈ పోస్టులకు సంభందించి పరిక్షా నిర్వహణ అనేది క్రింది విధంగా ఉండటం జరుగుతుంది. ఈ పరిక్షా నిర్వహణకు 2 గంటలు సమయం ఇవ్వడం జరుగుతుంది.

పరిక్ష లో 120 మల్టిపుల్ చాయిస్ క్వషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతీ ప్రశ్నకు 1 మార్కు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ప్రతీ తప్పు ప్రశ్నకు 1/4 వ వంతు నెగెటివ్ మార్కుల విధానం కలదు.

పరీక్షా కేంద్రాలు:

ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆదిలాబాద్,మంచిర్యాల,ఖమ్మం, కరీమ్‌నగర్, వరంగల్, కొత్తగూడెం, హైదరాబాద్ కేంద్రాలు లలో పరిక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. 

Website

Notification

Apply Now 

Post a Comment

0 Comments