సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ( సి.జి.డబ్ల్యూ. బి ) నుంచి గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్ :
భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నాగపూర్ లోని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ( సి.జి.డబ్ల్యూ. బి ) నుంచి గ్రూప్ సి స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి.ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష అనేది ఉండదు.ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తులు చేసుకునే అవకాశం కలదు.
ముఖ్యమైన తేదీలు :
ఈ పోస్టుల భర్తీకి సంభందించి చివరి తేది అనేది ప్రకటన విడుదల అయిన 30 రోజుల లోపు అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన అంశాలు :
* ఏ విధమైన రాత పరీక్ష లేదు
* పర్మెనెంట్ ఉద్యోగాలు
* సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
పోస్టుల సంఖ్య :
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ( సి.జి.డబ్ల్యూ. బి ) నుంచి మొత్తం 26 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారిగా పోస్ట్ లు :
స్టాఫ్ కార్ డ్రైవర్ - 26
అర్హతలు:
ఈ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. మరియు
హెవీ వెహికల్స్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి.
మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం మరియు మోటార్ మెకానిజమ్ అనేది తెలిసి ఉండాలి.
హిందీ మరియు ఇంగ్లీషు భాషలలో చదవటం మరియు రాయడం అనేది వచ్చి ఉండాలి.
వయస్సు:
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18-27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
రిజర్వేషన్ బట్టి అభ్యర్థులకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.
జీతం :
లెవల్-2 ( 19,900)
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు అందరినీ కూడా ముందుగా షార్ట్ లిస్ట్ చేసి తరువాత ఇంటర్వ్యూ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకొవలసి ఉంటుంది. దరఖాస్తు పారం నింపి సంబందిత దృవపత్రాలు నకళ్ళు జతపరచి క్రింది అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది. ( స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి)
చిరునామా :
Regional Director CGWB, Central Region N.S Building Opp. Old VCA, Civil Lines, Nagpur 440001
ఫీజు :
ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:
ఇండియా మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చెయ్యవలసి ఉంటుంది.
0 Comments