తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి సంభందించిన ఉన్నత విద్యా శాఖ నుంచి వివిధ విభాగాలలో భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
దీనికి సంభందించి ఈ నెల 22 వ తేదీన ఆర్థిక శాఖ వేర్వేరుగా 5 జీవో లను విడుదల చేయడం జరిగింది. త్వరలో ఈ పోస్టుల భర్తీకి అధికారకంగా నోటిఫికేషన్ లను జారీ చేయనున్నారు.
మొత్తం 2,440 పోస్టులను తెలంగాణా భర్తీ చేయనుంది.
ఈ మేరకు విడుదల అయ్యే పోస్టులలో అధికంగా ప్రభుత్వ కళాశాలలు అయిన డిగ్రీ మరియు జూనియర్ కాలేజీ లలో అధ్యాపకులు, ఫిసికల్ డైరెక్టర్స్ మరియు లైబ్రెరియన్ పోస్టులు అనేవి భర్తీ చేయనున్నారు.
ఇంటర్ విద్యాశాఖ లో
అధ్యాపకుల పోస్టులు - 1,392
లైబ్రెరియన్ - 40
ఫిసికల్ డైరెక్టర్స్ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.
అదే విధంగా కళాశాల విద్యాశాఖ లో
అధ్యాపకుల - 491
లైబ్రెరియన్- 24
ఫిసికల్ డైరెక్టర్స్-29
అంతేకాక పాలిటెక్నిక్ కళాశాల విభాగంలో
అధ్యాపకుల - 247
లైబ్రెరియన్ - 31
ఫిసికల్ డైరెక్టర్స్- 37
జూనియర్ ఇన్స్ ట్రాక్టర్ పోస్టులు - 14
ఎలక్ట్రిషియన్-25
ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి.
0 Comments