స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ( ఎస్.ఎస్.సి ) ద్వారా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ( డ్రైవర్ ) - మేల్ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు భారత దేశంలో గల అన్నీ రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సొంత రాష్ట్రంలో ఎగ్జామినేషన్ నిర్వహణ అనేది కలదు.
ఈ పోస్టులకు సంభందించి మరిన్ని వివరాలు ( హైట్, వెయిట్, ఫీజు, అర్హతలు, అప్లై చేసుకునే విధానం ) సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన అంశాలు:
1). ఇవి పేర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.
2). భారీ సంఖ్యలో ఉద్యోగాలు
3). భారీ మొత్తంలో వేతనాలు
4). చిన్న వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక
5). తక్కువ విద్యా అర్హతతో పోస్టుల భర్తి
6). ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.
7). తెలుగు రాష్ట్రాలలో పరీక్ష నిర్వహణ.
8). ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మేల్ అభ్యర్థులు మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అర్హులే.
857 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు :
అయితే ఇదే రోజు 857 హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి సంబందించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్ట్ లకు 10+2 ( సీనియర్ సెకందరీ) సైన్స్ మ్యాధమెటిక్స్ సబ్జెక్టుల్లో లేదా మెకానిక్-కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ట్రేడ్ లో నేషనల్ ట్రెడ్ సర్టిఫికేట్ ఉత్తీర్ణత అయి ఉండాలి.
మరియు ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్ వేగం-1000 కీ డిప్రెషన్‌ల పరీక్ష 15 నిమిషాలలో చెయ్యగలగాలి. ప్రాథమిక కంప్యూటర్ ఫంక్షన్ల పరీక్ష: PC తెరవడం/మూసివేయడం, ప్రింటింగ్, MS ఆఫీస్ వినియోగం, టైప్ చేసిన వచనంలో సేవ్ & సవరణ, పేరా సెట్టింగ్ & నంబరింగ్ మొదలైనవి వచ్చి ఉండలి.
జీతం 25,500-811000 వరకు ఉంటుంది. CBT పరీక్ష, శారీక పరీక్ష, ఫిజికల్ మెజర్‍మెన్ట్స్, ఇంగ్లీష వర్డ్ ప్రోససింగ్, బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచరం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. Click Here
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ ధరఖాస్తులకు ప్రారంభ తేదిలు : 08 జులై 2022
ఆన్లైన్ ధరఖాస్తులకు చివరి తేదిలు : 29 జులై 2022
పరీక్ష నిర్వహించు తేదీ : అక్టోబర్, 2022
ఫీజు చెల్లించాల్సిన తేదీ : 29 జులై 2022
పోస్టు యొక్క పేరు:
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ( డ్రైవర్ ) - మేల్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది.
మొత్తం ఖాళీలు:
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ( డ్రైవర్ ) - మేల్ ఉద్యోగాలు మొత్తం 1411 పోస్టులు భర్తీ చేయనున్నారు. SSC 1411 Jobs Recruitment Telugu
విభాగాల వారీగా ఖాళీలు:
జనరల్/యు.ఆర్ - 604
ఇ.డబ్ల్యూ.ఎస్ - 142
ఓ.బి.సి - 353
ఎస్సీ - 262
ఎస్టీ - 50
మొత్తం 1411 పోస్టుల భర్తీకి సంభందించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఇందులో ఎక్స్ - సర్వీస్ మెన్ అభ్యర్థులకు వేరుగా పోస్టులు కేటాయించటం జరిగింది.
అర్హతలు :
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి 10+2 పూర్తి చేసి ఉండాలి. మరియు హెవీ వెహికల్స్ నడపడం వచ్చి ఉండాలి.
వయసు వివరాలు :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 21 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల లోపు వుండాలి.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ/ ఎస్టి కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ - 3 ప్రకారం నెలకు 21,700/-రూపాయల నుంచి 69,100/-రూపాయల వరకూ ఆకర్షనీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం :
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి అందులో ఎంపికైన అభ్యర్థులకు ఫిసికల్ ఎడ్యురేన్స్ ( పి.ఇ) మరియు మెసెర్మెన్ట్ టెస్ట్ ( ఎం.ఇ) తరువాత ట్రేడ్ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ విధానం లో అప్లై చేసుకొవాల్సి ఉంటుంది.
ఫీజు వివరాలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులలో మహిళలు/ ఎస్సీ/ఎస్టీ/పి.డబ్ల్యూ.డి/ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జనరల్ / ఇ.డబ్ల్యూ.ఎస్ మరియు ఓబీసీ కేటగిరీ గల పురుషులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి 100/- రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్షా నిర్వహణ వివరాలు :
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు
జనరల్ ఎవెర్నెస్స్ - 20
జనరల్ ఇంటెలిజెన్స్ - 20
న్యూమెరికల్ ఎబిలిటీ - 10
ట్రాఫిక్ రూల్స్/సిగ్నల్ వెహికల్స్ /మోటార్ వెహికల్స్ తదితర అంశాలపై 50 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది.మొత్తం 90 నిమిషాలు సమయం ఇవ్వడం జరుగుతుంది.
ప్రతీ తప్పు ప్రశ్నకు 0.25 నెగెటివ్ మార్కులు ఉంటాయి.
పరీక్షా నిర్వహించు స్థలం:
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సొంత రాష్ట్రంలో ఎగ్జామినేషన్ నిర్వహణ అనేది ఉంటుంది.
0 Comments