ఆంధ్రప్రదేశ్లోని మోడల్ స్కూల్ లలో పనిచేయుటకు వివిధ విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తన సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 08-ఆగస్ట్-2022
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 17 ఆగస్టు 2022
ప్రొవిజినల్ సీనియార్టీ లిస్టు తయారు చేసే తేదీ: ఆగస్ట్ 23
అభ్యంతరాలను స్వీకరించి తేదీ: ఆగస్టు 24 మరియు 25 తేదీలు
అభ్యంతరాలు పరిష్కరించే తేదీ: ఆగస్టు 26 మరియు 27 తేదీలు
జోన్ల వారీగా ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క లిస్టు విడుదల అయ్యే తేదీ: ఆగస్టు 29
టీచింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ డెమో ఇవ్వబడే తేదీలు: ఆగస్టు 30 మరియు సెప్టెంబర్ 1 తేదీలు
ఫైనల్ గా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసే తేదీ: సెప్టెంబర్ 5
వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించు తేదీ: సెప్టెంబర్ 8
జాయిన్ అయ్యే తేదీ: సెప్టెంబర్ 9
పోస్టుల సంఖ్య:
పిజిటి మరియు టిజిటి విభాగంలో మొత్తం 282 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
పిజిటి-211
టిజిటి-71
అర్హతలు:
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో రెండేళ్ల మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ లో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
మరియు ఎంకామ్ అప్లైడ్, బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ లో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అనర్హులు.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు సంబంధిత సబ్జెక్టులో బీఈడీ పూర్తిచేసి ఉండాలి మరియు సంబంధిత ప్రొఫెషనల్ కోర్స్ లో పాస్ అయి ఉండాలి.
వయసు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
అభ్యర్థులు యొక్క అర్హతలు పరిశీలించి ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
0 Comments