Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

TSPSC DAO Posts Recruitment : TSPSC నుండి DAO పోస్టులు జీతం 46,960

TSPSC నుండి డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ: 17 ఆగస్టు 2022

ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 6 సెప్టెంబర్ 2022

హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవలసిన తేదీ: ఎగ్జామినేషన్ జరగడానికి 7 రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల సంఖ్య:

మొత్తం 53 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

జోన్ల భారీగా డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి.

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 44 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది.

జీతం:

ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 45,960 నుండి 1,24,150 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు TSPSC ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరిగింది.

చెల్లించవలసిన ఫీజు:

క్యాటగిరి లను బట్టి అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 200 రూపాయలు మరియు ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.



Apply Now : 17 నుంచి అదుబాటులో ఉంటుంది. 




Post a Comment

0 Comments