ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన నెల జూలై 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించబడిన గ్రూప్ - 4 పరీక్షలకు సుమారుగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 2,11,495 మంది అభ్యర్థులు హాజరు అవ్వడం జరిగిందని ఏపీపీఎస్సీ తాజాగా ఒక అధికారిక ప్రకటనను జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకు చెందిన రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి గడిచిన ఏడాది డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల కాగా, అప్పట్లో మొత్తం 3,86,195 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
కాగా, తాజాగా జరిగిన ఈ పరీక్షకు అప్లై చేసుకున్న మూడు లక్షల మందిలో కేవలం 2,11,495 మంది అభ్యర్థులు మాత్రమే హాజరు అవ్వడం జరిగింది.
ఇప్పుడు ఈ హాజరు శాతం అనునది గ్రూప్ - 4 పోస్టుల కట్ ఆఫ్ మార్కులపై తీవ్ర ప్రభావం చూపించనున్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు.
గ్రూప్ 4 నోటిఫికేషన్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఈ పరీక్షలు వ్రాసిన ఓపెన్ కేటగిరీ (ఓసీ) కేటగిరీ అభ్యర్థులు 40% అనగా 60 మార్కులు,
బీసీ కేటగిరీ అభ్యర్థులు 35% అనగా 52.5% మార్కులు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 30% మార్కులు అనగా 45 మార్కులును సంపాదించగలిగితే ఈ పరీక్షలలో క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తామని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లో పొందుపరిచినది.
అయితే ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కు అభ్యర్థులను క్వాలిఫై చేసే విధానంపై ఏపీపీఎస్సీ అతి త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది.
ఈ సారి ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది.
ఒక వేళ 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తే గనుక, ఆయా కేటగిరీల అభ్యర్థులకు కేటగిరీల వారీగా నోటిఫికేషన్ లో పొందుపరిచిన క్వాలిఫై మార్కులపై 10 మార్కులు అధికంగా స్కోర్ చేయగలిగితే మెయిన్స్ కు సులభంగా చేరుకోవడానికి అవకాశాలు పుష్కళంగా ఉన్నట్లు మనం అంచనా వేసుకోవచ్చు.
ఉదాహరణకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు నోటిఫికేషన్ లో పొందుపరిచిన క్వాలిఫై మార్కులు 60 మార్కులు, వీళ్ళు గనుక 70 మార్కుల పైన స్కోర్ సాధించగలిగితే మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించడానికి అవకాశాలు ఉంటాయి.
మరియు బీసీ కేటగిరీ అభ్యర్థులకు క్వాలిఫై మార్కులు 52.5 మార్కులు ఉండగా, వీరు గనుక 62 మార్కులకు పైగా గనుక స్కోర్ వస్తే మెయిన్స్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవచ్చు. ఇక ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు క్వాలిఫై మార్కులు 45 మార్కులు ఉండగా,
ఈ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 55 నుండి 60 మార్కుల పైన స్కోర్ గనుక తెచ్చుకుంటే మెయిన్స్ కు అర్హత సాధించే అవకాశాలు దాదాపుగా ఉన్నట్లుగా మనం ఈ గ్రూప్ - 4 కట్ ఆఫ్ మార్కులను అంచనా వేసుకోవచ్చు.
ఇక చివరిగా, 60 మార్కులకు పైన ఎవరైతే గ్రూప్ - 4 పరీక్షల్లో స్కోర్ చేయగలిగారో, ఆ అభ్యర్థులు అందరూ మెయిన్స్ కు అర్హతలు సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున, అభ్యర్థులు అందరూ మీ విలువైన సమయం వృధా చేయకుండా మెయిన్స్ పరీక్షలకు ప్రేపరషన్ ను ప్రారంభించడం ఉత్తమం అయినది అని మనం చెప్పుకోవచ్చు.
0 Comments