ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ సౌత్ సెంట్రల్ జోన్ నుండి హాస్పిటాలిటీ మోనిటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. మరియు కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులను మొదట రెండు సంవత్సరాలకు భర్తీ చేయడం జరుగుతుంది.
తర్వాత రిక్వైర్మెంట్స్ ను బట్టి మరొక సంవత్సరం పొడిగించే అవకాశం ఉంటుంది. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన అంశాలు :
* ఏ విధమైన రాత పరీక్ష లేదు
* సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
మొత్తం పోస్ట్ లు :
60
విభాగాల వారిగా పోస్ట్ లు :
హాస్పిటాలిటీ మోనిటర్
ముఖ్యమైన తేదీలు:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావాల్సిన తేదీలు: 24 ఆగస్టు 2022 నుండి 28 ఆగస్టు 22 వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ లో 3 సంవత్సరాలు ఫుల్ టైం బీఎస్సీ చేసి ఉండాలి.
మరియు కేవలం 2021-2022 అకాడమిక్ ఇయర్ లో పాస్ అవుట్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.
వయస్సు:
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 28 సంవత్సరాల ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ బట్టి అభ్యర్థులకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.
జీతం :
30,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది
ఎంపిక చేసుకునే విధానం:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఇంటర్వ్యూ కి హాజరుకావాల్సిన చిరునామా:
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన చిరునామా కు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్,
విద్యానగర్,
డి డి కాలనీ,
హైదరాబాద్, తెలంగాణ-500007
ఫీజు :
ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:
ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, మహారాష్ట్ర ఒడిశా, & ఛత్తీస్‌గఢ్. పోస్ట్ చేయబడవచ్చు లేదా ఇండియా మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చెయ్యవలసి ఉంటుంది.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
0 Comments