గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంటు నుండి ఒక ఉద్యోగ ప్రకటన విడుదల అయినది.
గవర్నమెంట్ హాస్పిటల్, కాకినాడ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గానూ ఒక నోటిఫికేషన్ వచ్చినది.
కేవలం 10వ తరగతి విద్యా అర్హతతో నెలకు 15,000 రూపాయలు జీతం లభించే ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భవిష్యత్తులో జరిగే ఉద్యోగ నియామకలలో వెయిటేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
పూర్తిగా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారని ప్రకటనలో పొందుపరిచారు.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను అందించడానికి చివరి తేది : జూలై 29, 2023 (సాయంత్రం 5 గంటల లోపు ).
విభాగాల వారీగా ఖాళీలు :
థియేటర్ అసిస్టెంట్ - 1
మేల్ నర్సింగ్ ఆర్డర్లీ - 4
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ - 2
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డ్ ల నుండి 10వ తరగతిలో ఉత్తిర్ణత చెంది, డిప్లొమా ఇన్ మెడికల్ స్టేరిలైజెషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సు ను పూర్తి చేసి, ఏపీ పారామెడికల్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ అయి ఉన్న అభ్యర్థులు థియేటర్ అసిస్టెంట్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన బోర్డ్ / ఇన్స్టిట్యూట్ ల నుండి 10వ తరగతిలో ఉత్తిర్ణత చెంది, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.
వయసు :
42 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎస్సీ / ఎస్టీ / బీసీ /ews కేటగిరీ అభ్యర్థులుకు 5 సంవత్సరాలు / దివ్యంగులకు 10 ఏళ్ళ వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ వెబ్సైటు నుండి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకోని, తదుపరి నింపిన సంబంధిత చిరునామాకు నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఓసీ / బీసీ కేటగిరీ అభ్యర్థులు 400 రూపాయలు, ఎస్సీ /ఎస్టీ /ews /పీహెచ్ /ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
విద్యా అర్హతల మార్కులను మరియు అనుభవం అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
నెలకు 15,000 రూపాయలు జీతం అందనుంది.
దరఖాస్తులను పంపవల్సిన చిరునామా :
Office of the Superintendent,
Govt. General Hospital,
Kakinada District,
Kakinada.
Website Link Click Here
0 Comments