ఏపీఎస్ఆర్టీసీ లో భారీగా ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.
గడిచిన రోజున ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘ నేతలతో ఆర్టీసీ ఎండి గారుకు జరిగిన సమావేశంలో భాగంగా ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న 2500 డ్రైవర్ పోస్టుల భర్తీనకు ఏపీ ప్రభుత్వం తమ ఆమోదం తెలిపినది అని, ఇంకొక నెల రోజులలో ఈ ఉద్యోగాల భర్తీకీ నియామక నోటీసు జారీ చేస్తామని గౌరవనీయ ఆర్టీసీ ఎండి ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపినట్లు తెలుస్తుంది.
ఇవే కాకుండా, 2011 సంవత్సరంలో పొందుపరిచిన నిబంధనలు పరిగణనలోనికి తీసుకుని ఖాళీలను భర్తీ చేయాలనీ మరియు 2024 జనవరి నాటికి ఆర్టీసీ లో రిటైర్మెంట్ ల ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా భర్తీ చేయడానికి అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది.
0 Comments