పోస్టల్ శాఖలో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియా మొత్తం లో ఎవరైన ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. మీరు ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. శాలరీ తో పాటు మీకు ఇతర అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పోస్ట్ లకు సంబందించి పూర్తి సమాచరం క్రింద ఇవ్వడం జరిగింది.
పోస్ట్ ల యొక్క పేర్లు : నైపుణ్యం కలిగిన కళాకారులు (జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-సి, నాన్ గెజిటెడ్, మంత్రి యేతర)
విభాగాలు :
మోటారు వాహన మెకానిక్స్
మోటారు వాహన ఎలక్ట్రీషియన్
చిత్రకారుడు
టైర్మాన్
అర్హతలు :
(i) ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సాంకేతిక సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్ ఉండాలి. లేదా 8 వ తరగతి మరియు సంబంధిత ట్రేడ్‌లో ఒక సంవత్సరం అనుభవం ఉన్న సర్టిఫికేట్ ఉండాలి.
(ii) మోటారు వెహికల్ మెకానిక్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థి ఏదైనా వాహనాన్ని పరీక్షించడానికి సేవలో నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (HMV) కలిగి ఉండాలి.
వయస్సు:
18-30 సంవత్సరాల మద్య వయస్సును కలిగి ఉండాలి మరియు SC,ST కి 5 సంవత్సరాలు, OBC కి మూడు సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.
జీతం: రూ. 19,900/- నుండి 63200/- (7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో స్థాయి-2)+అలవెన్సులు.
ఎలా ఎంపిక చేస్తారు :
స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. టెస్ట్ ఎప్పుడు నిర్వహిస్తారు, వేదిక మరియు ఇతర వివరలు సరైన అర్హతలు ఉన్న వారికి తెలియజెయ్యడం జరుగుతుంది. సరైన విద్యార్హత సర్టిఫికేట్ లు లేని వారికి ఏ విధమైన సమచారం ఉండదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
సంబందిత దృవ పత్రాలను ఈ క్రింద కనిపిస్తున్న చిరునామకి పంపవలసి ఉంటుంది. నోటిఫికేషన్ 3 వ పేజిలో అప్లికేషన్ ఉంటుంది. దానిని పూర్తి చేసి సంబందిత పత్రాలు జతచేసి ఈ క్రింది చిరునామకి పంపవలసి ఉంటుంది.
చిరునామ : Manager, Mail Motor Service, No.4, Basaveshwara Road, Vasanth Nagar, Bengaluru-560001 కి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది.
అభ్యర్థులకు అధికారిక వెస్‌సైట్ లింక్ మరియు నోటిఫికేషన్స్ లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది.
0 Comments