ఆంధ్రప్రదేశ్ లో జరిగిన AP ఎలక్షన్ 2024 లో అధికార పార్టీకి DSC అభ్యర్థులు చుక్కలు చూపించారు. అధికార పార్టీ ఒడిపొవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికి ముఖ్యమైన కారణాలలో ఒకటి DSC అభ్యర్థుల ఆగ్రహంగా చెప్పుకోవచ్చును.
మేము వస్తే మెగా DSC ఇస్తామని చెప్పి నమ్మబలికి అధికారం లోనికి వచ్చిన తరువాత కనీసం ఒక చిన్న DSC కూడా నిర్వహించలేదు. చివరి సంవత్సరంలో 6100 పోస్ట్ లతో ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి అది అనేక వివాదాలకు దారితీసిన విషయం మన అందరికి తెలిసినదే.
అయితే YCP పార్టీకి కేవలం 11 సీట్లు రావడం తో అభ్యర్థులు తమ యొక్క గ్రూప్ లలో అనేక విషయాలు చర్చించుకుంటున్నారు. 8 జిల్లాలలో DSC పోస్ట్ ల సంఖ్య "0", 8 జిల్లాలలో ycp సాధించిన సీట్లు "0" గుర్తించుకోండి ధర్నాలు చేసేటప్పుడు చెప్పాం మాకు ఎన్ని "0" లు ఇచ్చావో మీకు అన్ని "0" లు ఇస్తాం అని అప్పుడు చెప్పాం ఇప్పుడు చేశాం-- చెప్పాం అంటే చేస్తాం అంతే ఇట్లు DSC అభ్యర్థులు అని గ్రూఫ్ లలో సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు.
అయితే చంద్రబాబునాయుడు గారు తన యొక్క తొలి సంతకం Mega DSC పై అని హమీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబందించి పూర్తి సమాచరం ఉన్నప్పుడు తప్పని సరిగా మీకు తెలియజెయ్యడం జరుగుతుంది.
0 Comments