టెట్ దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు/తప్పులు దొర్లినట్లయితే ఎడిట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఇందుకోసం ముందుగా AP TET 2024 అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్ అవ్వాలి. అక్కడ మెనూపై క్లిక్ చేసి క్యాండిడేట్ సర్వీసెస్ ఎంచుకోవాలి. పిదప డిలీట్ అప్లికేషన్ ద్వారా మనం గతంలో ( ఈ నోటిఫికేషన్ మాత్రమే ) అప్లై చేసిన దరఖాస్తును తొలగించి, మరలా సరైన వివరాలతో అప్లోడ్ చేసి సబ్మిట్ చెయ్యవలసి ఉంటుంది.
గమనిక: ఏ ఇతర కారణాల వల్లనైనా డిలీట్ చేసి అలాగే వదిలేస్తే మీ అప్లికేషన్ రద్దువుతుంది. తర్వాత హల్ టికెట్ కూడా వచ్చే అవకాశం ఉండదని గుర్తించగలరు.
టెట్ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు ఉంటుంది :
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( TET ) విషయంలో కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌పోద్రియాల్ తెలిపారు. 2021 నుంచి ఇది వర్తిస్తుందని పేర్కోన్నారు. ఇప్పటికే ఏడేళ్ళ కాలం గడిచిన అభ్యర్థులకు తాజాగా టెట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
0 Comments