గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ది న్యూ ఇండియా అస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్.
ముంబై లో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ఆన్లైన్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేయనున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాల దరఖాస్తులకు అర్హులే అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
భారీ స్థాయిలో జీతములు లభించే ఈ ఉద్యోగాలకు సంబంధించిన అతి ముఖ్యమైన ముఖ్యంశాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం. New india assurance Jobs Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : సెప్టెంబర్ 1 , 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : సెప్టెంబర్ 21, 2021
ఫేజ్ -1 ఆన్లైన్ పరీక్షల నిర్వహణ తేది : అక్టోబర్ 2021
ఫేజ్ -2 ఆన్లైన్ పరీక్షల నిర్వహణ తేది : నవంబర్ 2021
ఉద్యోగాలు - వివరాలు :
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు(జనరలిస్ట్ -స్కేల్ 1) - 300
విభాగాల వారీగా ఖాళీలు :
SC - 46
ST - 22
OBC - 81
EWS - 30
UR - 121
మొత్తం పోస్టులు :
తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో 60% గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
21 నుండి 30 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ కేంద్ర ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎస్సీ /ఎస్టీ /PWD అభ్యర్థులు 100 రూపాయలు మరియు జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ప్రిలిమ్స్, మెయిన్స్ (ఫేజ్ 1&2) మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 32,795 రూపాయలు నుండి 62,315 రూపాయలు వరకూ జీతం అందనుంది.
పరీక్షలు - సిలబస్ :
ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీసనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ తదితర అంశాలను పై ఫేజ్ -1&2 పరీక్షలలో ప్రశ్నలను అడగనున్నారు.
పరీక్ష కేంద్రాలు - నగరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు పరీక్షకేంద్రాలుగా ఈ క్రింది నగరాలను ఎంపిక చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ :
చీరాల , గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మరియు విజయనగరం.
తెలంగాణ :
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్.
పరీక్ష లేదు, ఏపీ అంగన్వాడీ లో ప్రభుత్వ ఉద్యోగాలు
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,20,000
0 Comments