ఏపీ లో ప్రభుత్వ ఉద్యోగాలు, APEPDCL లో 398 జూనియర్ లైన్ మాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

1) తక్కువ విద్యా అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలు.
2). ఆసక్తికరమైన జీతములు.
3).లోకల్ & పేర్మినెంట్ జాబ్స్.
ఏపీ స్టేట్ లో గల 13 జిల్లాల పరిధిలో ఉన్న గ్రామ /వార్డ్ సచివాలయంలో పరిధిలో ఖాళీగా ఉన్న 398 ఎనర్జీ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL), విశాఖపట్నం నుంచి జారీ అయినది. APEPDCL Lineman Jobs telugu
ఈ పోస్టులను శాశ్వత నియామక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేయనున్న ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 13 జిల్లాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
80:20 (లోకల్ : నాన్ లోకల్ ) నిష్పత్తి ఆధారంగా ఈ నియామకాలను జరుపనున్నారు. APEPDCL చేపట్టబోయే ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది : ఆగష్టు 30, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు(ఫీజు )చివరి తేది : సెప్టెంబర్ 24, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ఎనర్జీ అసిస్టెంట్స్ (జూనియర్ లైన్ మాన్ గ్రేడ్ -3) - 398
ప్రాంతముల వారీగా ఖాళీలు :
శ్రీకాకుళం - 88
విజయనగరం - 74
విశాఖపట్నం - 71
రాజమండ్రి - 122
ఏలూరు - 43
మొత్తం పోస్టులు :
మొత్తం 398 పేర్మినెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి మరియు సంబంధిత విభాగాలలో ఐటీఐ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫ్రెషర్స్ మరియు అనుభవం గల అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు అర్హులు అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఓసీ /బీసీ కేటగిరీ అభ్యర్థులు 700 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 350 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
క్వాలిఫైయింగ్ టెస్ట్ (వ్రాత పరీక్ష ) ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పరీక్ష తదుపరి పోల్ క్లెయింబింగ్, మీటర్ రీడింగ్, సైక్లింగ్ తదితర అంశాలను కూడా పరీక్షించనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతముగా మొదటి రెండు సంవత్సరాలు 15,000 రూపాయలను ఇవ్వనున్నారు.
రెండు సంవత్సరాల అనంతరం ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు జీతములు పెరిగే అవకాశం కలదు.
పరీక్ష కేంద్రాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది జిల్లా కేంద్రాలలో వ్రాత పరీక్షలను నిర్వహించనున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు హెడ్ క్వార్టర్స్ లో అభ్యర్థులకు ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నారు.
పరీక్ష లేదు, ఏపీ అంగన్వాడీ లో ప్రభుత్వ ఉద్యోగాలు
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,20,000
0 Comments