Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

DRDO Jobs Telugu : పరీక్ష లేదు, DRDO లో ఉద్యోగాలు, జీతం 31,000+HRA

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ మెంట్స్, 

చండిఘర్  లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ వెలువడినది.

DRDO Jobs Telugu


ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇపుడు తెలుసుకుందాం. DRDO Jobs Telugu

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది  : ప్రకటన వచ్చిన 21 రోజుల లోపు.

విభాగాల వారీగా ఖాళీలు   :

జూనియర్ రీసెర్చ్ ఫెలో      -     6

మొత్తం ఉద్యోగాలు  :

మొత్తం 6 పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

సంబంధిత విభాగాలలో బీఈ / బీ. టెక్ / ఎంఈ /ఎం.టెక్ కోర్సులను పూర్తి చేసి, నెట్ /గేట్  వాలీడ్ స్కోర్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరచడం జరిగింది.

వయసు :

28 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానం ద్వారా వెబ్సైటు లో దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసి, తదుపరి నింపిన దరఖాస్తు ఫారం కు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింది అడ్రస్ కు రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా నిర్ణిత గడువు తేదిలోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం  :

షార్ట్ లిస్ట్ మరియు వెబ్ ఆధారిత ఆన్లైన్  ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31, 000 రూపాయలు జీతం మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లు లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా ( అడ్రస్ )  :

The Director,

Defence Geo-informatics Research Establishment (DGRE),

Himparisar, Plot No.1,

Sector 37 A, Chandigarh (UT) - 160036.

Website 

Notification 

Post a Comment

0 Comments