Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Bank of Maharashtra Jobs Telugu : బ్యాంక్ ఆఫ్ మహా రాష్ట్ర లో ఉద్యోగాలు, జీతం 69,810

భారత కేంద్ర ప్రభుత్వానికి చెందిన హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 1&2 పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.

అగ్రికల్చర్ సెక్టార్ విభాగంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులను  భర్తీ చేయనున్నారు. 

Bank of Maharashtra Jobs Telugu

భారీగా జీతములు లభించే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టుల అప్లై కు అర్హులే అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు. Bank of Maharashtra Jobs Telugu

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భారత దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచెస్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు .     

శాశ్వత (పేర్మినెంట్ ) ప్రాతిపదికన భర్తీ కానున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు  సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది   :   సెప్టెంబర్ 1, 2021

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది           :   సెప్టెంబర్ 19, 2021

విభాగాల వారీగా ఖాళీలు   :

అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్                  -           100

సెక్యూరిటీ ఆఫీసర్స్                          -            10

లా ఆఫీసర్స్                                       -            10

హెచ్. ఆర్  /పర్సనల్ ఆఫీసర్స్        -            10

ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రెటర్                 -           30

DBA (MSSAL/ఒరాకిల్ )                     -             3

విండోస్ అడ్మినిస్ట్రేటర్                       -           12

ప్రోడక్ట్ సపోర్ట్ ఇంజనీర్                      -            3

నెట్ వర్క్ & సెక్యూరిటీ అడ్మినిస్ట్రెటర్  -         10

ఈ - మెయిల్ అడ్మినిస్ట్రేటర్               -          2

మొత్తం ఉద్యోగాలు   :

మొత్తం 190 ఉద్యోగాలను తాజాగా విడుదలైన  నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

పోస్టుల విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్టు లలో గ్రాడ్యుయేషన్ /బ్యాచిలర్ డిగ్రీ /బీఈ /బీ. టెక్ /ఎంసీఏ /ఎంఎస్సీ /పీజీ డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు   :

20 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు   :

UR /EWS /OBC కేటగిరీ అభ్యర్థులు 1180 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 118 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

దివ్యాంగులకు మరియు అన్ని కేటగిరి లకు చెందిన మహిళలకు ఇటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎంపిక విధానం   :

ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతముగా 36,000 రూపాయలు నుండి 69,810 రూపాయలు వరకూ జీతం అందనుంది.

పరీక్ష కేంద్రం :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో పరీక్షను నిర్వహించనున్నారు.

Website

Notification

Apply Online

పరీక్ష లేదు, ఏపీ అంగన్వాడీ లో ప్రభుత్వ ఉద్యోగాలు

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,20,000


Post a Comment

0 Comments