Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Tirupati Jobs Telugu : పరీక్ష లేదు, తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన స్విమ్స్ లో ఉద్యోగాలు, జీతం 31,000

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 

తిరుపతి లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది. Tirupati Jobs Telugu

ముఖ్యమైన అంశాలు :

1). తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వ ఉద్యోగాలు,

2). పరీక్షలు లేవు,

3). మంచి స్థాయిలో జీతం.

Tirupati Jobs Telugu

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా టీటీడి లో ఉద్యోగాలను  భర్తీ చేయడం అభ్యర్థులకు మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు.

కేవలం ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే ఉద్యోగాల ఎంపికలు జరిగే ఈ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మంచి స్థాయిలో జీతములు లభించే ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఇంటర్వ్యూ నిర్వహణ తేది     :    సెప్టెంబర్  6,  2021

ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక   :

శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) తిరుపతి.

విభాగాల వారీగా ఖాళీలు   :

రీసెర్చ్ అసిస్టెంట్                      -       1

ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆఫీసర్      -       1

మల్టీ టాస్కింగ్ స్టాఫ్                  -       1

అర్హతలు   :

రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధిత సబ్జెక్టు లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి గ్రాడ్యుయేషన్ కోర్సును పూర్తి చేసి , డేటా ఎంట్రీ వర్క్ లో నాలెడ్జ్ కలిగి ఉండవలెను.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుండి మేట్రిక్యూలేషన్ (10వ తరగతి ) పూర్తి చేసి ఉండాలి.

మరియు కేటగిరీ లను అనుసరించి ఈ  పోస్టుల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులకు  సంబంధిత విభాగాలలో అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ భాష లో ప్రావీణ్యత కలిగి ఉండవలెను అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

వయసు  :

40 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు  (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఇంటర్వ్యూ హాజరు కాబోయే అభ్యర్థులు ఒరిజినల్ విద్యా అర్హతలుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, 

ఐడెంటిటీ కార్డు, రీసెంట్ కలర్ పాస్ పోర్ట్ సైజు ఫోటోస్ మరియు వీటితో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటేస్టేడ్ జీరాక్స్ కాపీ లను తమ వెంట తీసుకుని వెళ్ళవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం   :

షార్ట్ లిస్ట్ , పర్సనల్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Notification

పరీక్ష లేదు, ఏపీ అంగన్వాడీ లో ప్రభుత్వ ఉద్యోగాలు

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,20,000

Post a Comment

0 Comments