ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తాజాగా విడుదల చేసింది. AP 190 Govt Jobs Recruitment Telugu
ముఖ్యంశాలు :
1). ప్రభుత్వ ఉద్యోగాలు
2). డైరెక్ట్ పద్దతిలో శాశ్వత నియామకాలు
3). భారీ స్థాయిలో జీతములు
ఆన్లైన్ విధానంలో పరీక్షల ద్వారా భర్తీ చేసే ఈ పేర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
ఏపీపీఎస్సీ ద్వారా కల్పించబడే ఈ గవర్నమెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది : అక్టోబర్ 21, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : నవంబర్ 11, 2021
ఉద్యోగాలు - వివరాలు :
అసిస్టెంట్ ఇంజనీర్స్ - 190
(ఇందులో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 35 మరియు ఫ్రెష్ వేకెన్సీ పోస్టులు 155 ఉన్నాయి.)
విభాగాల వారీగా ఉద్యోగాలు :
సివిల్స్ / మెకానికల్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 190 అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టులను తాజాగా వెలువడిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి సంబంధిత విభాగాల సబ్జెక్టు లలో ఇంజనీరింగ్ డిప్లొమా / బీఈ /బీ. టెక్ /బీ.ఎస్సీ (ఇంజనీరింగ్ ) మొదలైన కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
వయసు :
18 నుండి 42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /బీసీ /EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 330 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 31,460 రూపాయలు నుండి 84,970 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments