గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఉన్న రైల్ ల్యాండ్ డెవలప్ మెంట్ అథారిటీ లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
1). ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగాలు.
2). కాంట్రాక్టు బేసిస్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
3). భారీ స్థాయిలో జీతం.
4). ఎగ్జామ్స్ నిర్వహణ లేదు.
తిరుపతి లో ఉండే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ జాబ్ నోటిఫికేషన్ ను మీ ప్రెండ్స్ అందరికి షేర్ చెయ్యండి. వారికి జాబ్ రావడానికి సహకరించండి.
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అని ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇరు తెలుగు రాష్ట్రములకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి మరియు నెల్లూరు స్టేషన్స్ లో మరియు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగర స్టేషన్ లో ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ, పోస్టులను కేటాయించినట్లు ఈ నోటిఫికేషన్ లో తెలిపారు.
తాజాగా జారీ అయిన ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేదీ : నవంబర్ 25, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : డిసెంబర్ 23, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ( సివిల్ ) - 45
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి 60% మార్కులతో ఫుల్ టైమ్ బీ. ఈ /బీ. టెక్ ( సివిల్ ఇంజనీరింగ్ ) / ఎం. ఈ /ఎం. టెక్ (సివిల్ ఇంజనీరింగ్ ) కోర్సులను పూర్తి చేసి, వాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
21 సంవత్సరాలు వయసు నుండి 28 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ క్రింది మెయిల్ అడ్రెస్ కు అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారం లకు సంబంధిత విద్య దృవీకరణ పత్రాలను జతపరిచి నిర్ణిత గడువు చివరి తేదీలోగా మెయిల్ చేయవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, కేవలం విద్యా అర్హతల మెరిట్ మరియు గేట్ స్కోర్ ల ఆధారంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ శాలరీ గా నెలకు 35,000 రూపాయలు జీతం మరియు ఇతర బెనిఫిట్స్ రూపంలో 14,000 రూపాయలు మరియు 4000 రూపాయలు ప్రొవిడెంట్ ఫండ్ (PF) మరియు మొబైల్ చార్జెస్ 700 రూపాయలు వరకు లభిస్తుంది.
మొత్తం అన్ని అలోవెన్స్ లు కలుపుకుని ఉద్యోగార్థులకు నెలకు 54,600 రూపాయలు వరకు జీతం అందనుంది.
ఈ జీతం తో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
Apply Email Address:
psecontract@gmail.com
1 Comments
Thank you bro Super
ReplyDelete