ఏపీ లో 398 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 398 ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మెన్, గ్రేడ్ -II) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది. AP 398 Jr Lineman Cut Off Marks
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న సుమారు 398 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి గత నెల అక్టోబర్ 10వ తేదీన వ్రాత పరీక్షలు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఏపీ లో జరిగిన ఈ వ్రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మరియు కట్ ఆఫ్ మార్కులను ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ (APEPDCL) తమ అధికారిక వెబ్సైటు లో విడుదల చేసి, పొందుపరిచింది.
ఈ పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైట్ లింక్ ద్వారా పరీక్షల ఫలితాలను మరియు కట్ ఆఫ్ మార్కులను చూసుకోవచ్చు.
0 Comments