గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఉన్న కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగాలు.
2). పరీక్షల నిర్వహణ లేదు.
3). మంచి స్థాయిలో వేతనాలు.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
కొంకన్ రైల్వే లో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు తెలుసుకుందాం. Railway Recruitment
ముఖ్యమైన తేదీలు :
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 17,2021.
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకూ.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
USBRL ప్రాజెక్ట్ హెడ్ ఆఫీస్, కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, సత్యం కాంప్లెక్స్, మార్బల్ మార్కెట్, ఎక్సటెన్షన్ - త్రికుటా నగర్, జమ్మూ, జమ్మూ & కాశ్మీర్ (UT), పిన్ కోడ్ : 180011.
ఉద్యోగాలు - వివరాలు :
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (సిగ్నల్ &టెలి కమ్యూనికేషన్ ) - 18
విభాగాల వారీగా ఖాళీలు :
జనరల్ - 9
ఓబీసీ - 4
ఎస్సీ - 3
ఎస్టీ - 2
అర్హతలు :
ఈ రైల్వే పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 60% మార్కులతో ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ / కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో బీ. ఈ / బీ. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
25 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చును.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత విద్యా దృవీకరణ పత్రాలను జతపరిచి తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతంతో పాటు నెలకు 350 రూపాయలు మొబైల్ బిల్ అలోవెన్స్ + 25,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ + 7,000 రూపాయలు వరకు మెస్సింగ్ అలోవెన్స్ + 750 రూపాయలు వరకూ మెడికల్ అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు Clik Here
APPSC ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు Clik Here
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here
0 Comments