తిరుపతి నగరంలో ఉన్న సధరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్(APSPDCL) విద్యుత్ నిలయం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1 ). ఇవి కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు.
2). టెస్టుల నిర్వహణ లేదు.
3). భారీస్థాయిలో సంవత్సరానికి 15 లక్షల రూపాయలు వరకూ జీతం.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ గవర్నమెంట్ పోస్టుల అర్హులైన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎటువంటి ఎగ్జామ్స్ నిర్వహణ లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయడం అనేది అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు APSPDCL /విద్యుత్ నిలయం /తిరుపతి లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
APSPDCL, తిరుపతి నుండి తాజాగా వచ్చిన ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : నవంబర్ 30,2021(5PM)
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : త్వరలో ప్రకటించబడుతుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
ఛార్టర్డ్ అకౌంటెంట్స్ - 2
మేనేజ్ మెంట్ ట్రైనీ - 8
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఛార్టర్డ్ అకౌంటెంట్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డు ల నుండి ఛార్టర్డ్ అకౌంటెంట్ కోర్సును పూర్తి చేసి, ICAI లో మెంబెర్ గా ఉండవలెను.మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.
మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు సీఏ (ఇంటర్మీడియట్ )/సీఎంఏ(ఇంటర్మీడియట్ ) కోర్సులను పూర్తి చేసి ఉండి, సంబంధిత విభాగాలలో అనుభవం కలిగి ఉండవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు 18 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
ఈ క్రింది వెబ్సైట్ లింక్ ను క్లిక్ చేసి, అభ్యర్థులు నేరుగా ఈ తిరుపతి APSPDCL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతముగా 27,400 రూపాయలు జీతం మరియు ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 10 నుండి 15 లక్షల రూపాయలు వరకూ జీతం అందనుంది.
తెలుసుకోవలసిన విషయాలు :
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ వెంట విద్యా అర్హతల దృవీకరణ పత్రములు, వయసు మరియు ఫీజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ వంటి మొదలైన ధ్రువీకరణ పత్రాలను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు Clik Here
APPSC ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు Clik Here
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here
0 Comments