ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో భారీ సంఖ్యలో 1100కు పైగా ఉద్యోగాలతో మెగా జాబ్ డ్రైవ్ ను నిర్వహించి, తద్వారా పలు ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న పలు విభాగాల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక అతి ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది.
1100 కు పైగా ఉద్యోగాలు,గుంటూరులో మెగా జాబ్ డ్రైవ్ , APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు , ఈ క్రింది లింక్ లో ఇప్పుడే రిజిస్ట్రేషన్స్ చేసుకోండి.
ముఖ్యంశాలు :
1). ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ APSSDC ఆధ్వర్యంలో జరుగును.
2). గౌరవ స్థాయిలో జీతం అందనుంది.
3).ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
4). పదవ తరగతి అర్హతలతో కూడా ఉద్యోగాలు.
APSSDC ఆధ్వర్యంలో భర్తీ కాబోయే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శ్రీ సిటీ, గుంటూరు,ఒంగోలు, విజయవాడ, ఏలూరు, భీమవరం, తణుకు, మార్కాపురం, అమృతలూరు, నర్సరావుపేట, మరియు హైదరాబాద్ నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
గుంటూరు జిల్లాలో లో నిర్వహించనున్న ఈ మెగా జాబ్ డ్రైవ్ కు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
జాబ్ డ్రైవ్ నిర్వహణ తేది : డిసెంబర్ 22, 2021
జాబ్ డ్రైవ్ నిర్వహణ సమయం : ఉదయం 9 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ & హైస్కూల్, వేమూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
జాబ్ డ్రైవ్ లో పాల్గొనే సంస్థలు :
హీరో మోటో కార్ప్
బ్లూ ఒషీన్ పర్సనల్ & అల్లిడ్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్
టాటా స్కై
NSL టెక్స్ట్ టైల్స్
టీమ్ లీజ్ సర్వీసెస్ లిమిటెడ్
మీషో
భరత్ FIH లిమిటెడ్
అపోలో ఫార్మసీస్ లిమిటెడ్
కుశలవ హ్యుందాయ్ & శ్రీ చక్ర గ్రూప్
ALF ఇంజనీరింగ్ ప్రయివేట్ లిమిటెడ్
మాస్టర్ మైండ్స్
శాంతి హోమియో ప్రయివేట్ లిమిటెడ్
టెక్స (జస్ట్ డయాల్ )
లియో గ్లోబల్ ఓవర్సిస్
ఫ్లెక్స్ ఇండియా
ఇన్నోవ్ సోర్స్ - ఎస్బీఐ కార్డ్స్
NRB బెరింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్
ఓలెక్ట్రా గ్రీన్ టెక్ ప్రయివేట్ లిమిటెడ్
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
ప్రొడక్షన్ ఆపరేటర్ | 100 |
కేబుల్ మాన్యూఫాక్చరింగ్ ఆపరేటర్ | 80 |
ప్రమోటర్స్ | 25 |
మల్టీపుల్ | 100 |
ఆపరేటర్స్ | 20 |
సేల్స్ ఆఫీసర్స్ | 100 |
అసెంబ్లీ ఆపరేటర్స్ | 50 |
మల్టీపుల్ | 100 |
మల్టీపుల్ | 60 |
మెషిన్ ఆపరేటర్ | 50 |
మల్టీపుల్ | 30 |
మల్టీపుల్ | 23 |
BRE | 60 |
మల్టీపుల్ | 45 |
అసెంబ్లీ ఆపరేటర్స్ | 100 |
BRE/RE/టెలికాలర్ | 60 |
టెక్నిక్యూస్ | 50 |
టెక్నిక్యూస్ | 50 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 1103 ఉద్యోగాలను ఈ జాబ్ డ్రైవ్ ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.
అర్హతలు :
10వ తరగతి /ఇంటర్మీడియట్ /ఐటీఐ/డిప్లొమా /డిగ్రీ/బీ. టెక్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ జాబ్ డ్రైవ్ కు హాజరు కావచ్చు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ప్రకటనలో పొందుపరిచారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల విధానముల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
కొన్ని విభాగాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ జీతంతో పాటుగా పీ. ఎఫ్+ బోనస్ +ఈఎస్ఐ+ఇంక్రిమెంట్స్+లీవ్ బెనిఫిట్స్ +గ్రాట్యుటీ +అవార్డ్స్ +రివార్డ్స్ +ప్రమోషన్స్ తదితర విలువైన ఇతర బెనిఫిట్స్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి.
Note : ఈ జాబ్ డ్రైవ్ కు హాజరు కాబోయే అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ లను ధరించి, తమ తమ రెస్యూమ్స్ + ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ జీరాక్స్ కాపీ లు మరియు ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు ఓటర్ ఐడి కార్డు లను తమ వెంట తీసుకుని రావలెను అని ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ - 19 ప్రోటోకాల్స్ ను అభ్యర్థులు అందరూ తప్పకుండా పాటించాలని ఈ ప్రకటనలో తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
7893789361
6301582948
9988853335
రైల్వే గ్రూఫ్-డి పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
0 Comments