గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఉన్న డైరెక్టరేట్ జనరల్ విభాగానికి చెందిన సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). స్పోర్ట్స్ కొటా -2021 క్రింద పోస్టుల భర్తీ జరుగనుంది.
2). ఇవి కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగాలు.
3). భారీ స్థాయిలో జీతములు.
4). అతి తక్కువ దరఖాస్తు ఫీజులు.
ఈ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఈ ఉద్యోగాలకు అర్హులైన ఇండియన్ సిటిజన్స్ అందరి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఈ ప్రకటనలో పొందుపరిచారు.
సీఐఎస్ఎఫ్ నుండి వచ్చిన ఈ తాజా ఉద్యోగ సమాచారం లో పొందుపరిచిన ముఖ్యమైన విషయాలను గురించి మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం. CISF Jobs Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మార్చి 31, 2022
నార్త్ ఈస్ట్ రీజియన్ దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఏప్రిల్ 7, 2022.
ఉద్యోగాలు - వివరాలు :
హెడ్ కానిస్టేబుల్స్ (జనరల్ డ్యూటీ ) - 249
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
అత్లేటిక్స్ ( పురుషులు + మహిళలు ) | 90 |
బాక్సింగ్ ( పురుషులు + మహిళలు ) | 18 |
బాస్కెట్ బాల్ | 8 |
జిమ్మ్నస్టిక్స్ | 5 |
ఫుట్ బాల్ | 10 |
హాకీ | 15 |
హ్యాండ్ బాల్ | 6 |
జూడో ( పురుషులు + మహిళలు ) | 11 |
కబడ్డీ ( పురుషులు + మహిళలు ) | 15 |
షూటింగ్ ( పురుషులు + మహిళలు) | 4 |
స్విమ్మింగ్ | 17 |
వాలీబాల్ | 5 |
వెయిట్ లిఫ్టింగ్( పురుషులు + మహిళలు) | 23 |
రీజీలింగ్ ( పురుషులు + మహిళలు ) | 14 |
టైక్వాండో | 8 |
మొత్తం పోస్టులు :
మొత్తం 249 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుండి ఇంటర్మీడియట్ కోర్సులను పూర్తి చేసి, సంబంధిత క్రీడా విభాగాలలో స్టేట్ /నేషనల్ /ఇంటర్నేషనల్ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ అత్లేటిక్స్ పోటీలలో పాల్గొని ప్రతిభను కనబరిచిన అభ్యర్థులు అందరూ విభాగాల వారీగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.
మరియు నిర్థిష్ట శారీరక ప్రమాణాలు అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 23 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో సంబంధిత చిరునామాలకు నిర్ణిత గడువు చివరి తేది లోగా అభ్యర్థులు తమ తమ దరఖాస్తు ఫారం లను మరియు విద్యా అర్హతల ధ్రువీకరణ పత్రములను పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలును డిమాండ్ డ్రాఫ్ట్ (DD)/పోస్టల్ ఆర్డర్ రూపంలో చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /మహిళా అభ్యర్థులు అందరూ ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసీన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ /డాకుమెంటేషన్ /ట్రైయల్ టెస్ట్ మరియు ప్రోఫీషియన్సీ టెస్ట్ / మెడికల్ ఎగ్జామినేషన్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 25,500 రూపాయలు నుండి 81,100 రూపాయలు వరకూ జీతం మరియు ఇతర అలోవెన్స్ లు లభించనున్నాయి.
రైల్వే గ్రూఫ్-డి పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
0 Comments