Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Post Office Scheme : బాలికల బంగారు భవిష్యత్తుకై ఒక వరం.. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం

మీ ఇంట్లో 10 సంవత్సరాలు కన్నా తక్కువ వయసు ఉన్న ఆడ పిల్లలు ఉన్నారా..? అయితే మీ ఇంట్లో ఉన్న చిన్నారి బాలికల బంగారు భవిష్యత్తుకోసం ఈ భారతీయ కేంద్ర ప్రభుత్వ పథకం "సుకన్య సమృద్ధి యోజన".. మీ కోసమే.

అసలు సుకన్య సమృద్ధి ఖాతా పథకం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి..? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 కు సంబంధించి వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి..? ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం బ్యాంక్ లకు వెళ్లాలా..? పోస్ట్ ఆఫీస్ లకు వెళ్లాలా..? ఈ ఖాతా ప్రారంభంనకు ఏయే సర్టిఫికెట్స్ అవసరం ఇలాంటి ముఖ్యమైన వివరాలు అన్ని మనం ఇపుడు తెలుసుకుందాం.

సుకన్య సమృద్ధి ఖాతా - ముఖ్యమైన వివరాలు   :

సుకన్య సమృద్ధి ఖాతా అనునది ఆడపిల్లల కోసం అనగా బాలికల కోసం 2015 వ సంవత్సరం జనవరి 22వ తేదీన ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రివర్యులు ఎంతో ప్రతిష్టత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం.ఇది బాలికల కోసం ప్రత్యేకంగా ఉన్న డిపాజిట్ పథకం.

సుకన్య సమృద్ధి ఖాతాను 10 సంవత్సరాల వయసు లోపు ఉన్న బాలికల పేరు మీద బాలికల యొక్క తల్లీదండ్రులు లేదా సంరక్షకులు మీ గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ లో గానీ లేదా మీ పరిసరాలకు దగ్గర్లో ఉన్న బ్యాంక్ లలో గానీ కేవలం 250 రూపాయలు చెల్లించి అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు.

ఈ ఖాతాకు బాలిక యొక్క నామినీ గా బాలికల యొక్క తల్లీతండ్రులు /సంరక్షకులు ఉండవలెను.

తాజాగా ఈ ఖాతాను ఉచితంగా కూడా తెరుచుకొనెందుకు అవకాశాన్ని భారతీయ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది.

అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుండి 14 సంవత్సరాలు నుండి 21 సంవత్సరాలు వరకూ ఈ ఖాతాను నిర్వహించుకోవచ్చు.

ఖాతా ఆరంభించిన నాటి నుండి ఖాతాదారులు ప్రతీ సంవత్సరం 1000 రూపాయలు నుండి 1,50,000 రూపాయలు వరకూ మనం డబ్బులను మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల పేరు మీద డిపాజిట్ చేసుకోవచ్చు.

ఇలా ఖాతాలో వేసిన డబ్బులకు ప్రతీ సంవత్సరం నకు ఒకసారి వడ్డీ లను కలుపుతారు.

ఇప్పటివరకూ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లలో ఈ పధకానికి అత్యంత ఎక్కువగా వడ్డీ లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు.

అయితే, ఈ దాచుకున్న డబ్బులను మాత్రం బాలికలకు 18 సంవత్సరాలు వచ్చే వరకూ తీసుకోవడానికి మాత్రం వీలుండదు.

బాలికకు 18 సంవత్సరాలు నిండిన తరువాత చదువు కోసం అయితే అప్పటి వరకూ కట్టిన మొత్తంలో సగం డబ్బులు మరియు 21 సంవత్సరాలు నిండిన తర్వాత మొత్తం డబ్బులను వడ్డీతో సహా చెల్లిస్తారు.

సుకన్య సమృద్ధి ఖాతా  తెరవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ :

1). బాలికల బర్త్ సర్టిఫికెట్ / ఆధార్ కార్డు 

2). తల్లీదండ్రులు /సంరక్షకుల ఆధార్ కార్డు

3).బాలికల కలర్ ఫొటోస్ - 4,

4). నామినిగా ఉండేందుకు తల్లీ తండ్రులు /సంరక్షకుల కలర్ ఫొటోస్ - 2.

5). రేషన్ కార్డు, పాన్ కార్డు ( అంత అత్యవసరం కాదు ).

పైన తెలిపిన డాక్యుమెంట్స్ ను మన గ్రామం / పట్టణం సమీపంలో ఉన్న బ్యాంక్ మరియు పోస్ట్ ఆఫీస్ లో కనుక సబ్మిట్ చేస్తే, 48 గంటలలోపు మనం ఈ సుకన్య సమృద్ధి ఖాతా అకౌంట్ ను సులభంగా పొందవచ్చును.

రైల్వే గ్రూఫ్-డి  పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here

DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here

Post a Comment

0 Comments