ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్, గ్రామ/వార్డ్ సచివాలయ డిపార్ట్మెంట్, ఏపీ సెక్రటరియేట్, వెలగపూడి నుండి ఈ అధికారిక ప్రకటన రావడం జరిగింది.
ఏపీ స్టేట్ లో గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో ప్రస్తుతం వివిధ విభాగాలలో వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్న గ్రామ /వార్డ్ సచివాలయ ఉద్యోగులందరికి ప్రోబేషన్ పీరియడ్ ను పూర్తి చేస్తూ డిక్లరేషన్ ను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల కలెక్టర్లను, రీజినల్ డైరెక్టర్స్ ను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 15, 2021 తేది నాటికీ ఈ ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలనీ ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులను జారీ చేసినది. AP Sachivalayam Jobs Update Telugu
ఈ ప్రక్రియను తప్పనిసరిగా అధికారులు అందరూ డిసెంబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలనీ ఈ ఉత్తర్వులలో పొందుపరిచారు.
ఏపీ గవర్నమెంట్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ద్వారా సుమారు ఒక లక్షమందికీ పైగా అభ్యర్థులు సచివాలయం ఉద్యోగాల ప్రోబెషన్ పీరియడ్ ను పూర్తి చేసుకుని, ఏపీ ప్రభుత్వపు రెగ్యులర్ ఉద్యోగులుగా మారానున్నట్లు తెలుస్తుంది.
ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఈ ఉత్తర్వులు గ్రామ /వార్డ్ సచివాలయలలో పని చేస్తున్న ఉద్యోగులకు ఒక మంచి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు.
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments