ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1,2,3 మరియు 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.
గతంలో గ్రూప్ 1 పరీక్షకు మినహా మిగిలిన గ్రూప్ 2,3 మరియు 4 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, కేవలం ఒకే ఒక్క పరీక్ష ద్వారా ఉద్యోగాల భర్తీని చేపట్టాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.
తాజాగా, గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే కొంతమంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించాలని సర్వీస్ కమిషన్ సభ్యులను కోరినట్లు, తద్వారా ఇకపై భవిష్యత్తులో చేపట్టే గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి మరలా ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించే వీలుందని కమిషన్ సభ్యులు తెలిపినట్లుగా ప్రముఖ దినపత్రికలు నేడు ఏపీపీఎస్సీ ఉద్యోగాలపై ప్రకటనను పొందుపరిచాయి.ఈ వార్త నిజం అయితే గనుక, భవిష్యత్తులో ఏపీపీఎస్సీ గ్రూప్ -1,2,3మరియు4 ఉద్యోగాల భర్తీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అనే రెండు అంచెల పరీక్షల విధానంలతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. APPSC Group 1,2,3 and 4 Update
మరోవైపు ఈ నెల ఆఖరు అనగా డిసెంబర్ 31 వ తేదీలోపు ఏపీ లో 670 రెవిన్యూ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు 60 ఏపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గ్రేడ్ - 3 ఆఫీసర్స్ పోస్టుల భర్తీకీ సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కసరత్తులు చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది.
జనవరి 1, 2022 కూడా నూతన జాబ్ క్యాలెండరు విడుదలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళికలు రచిస్తూన్నట్లుగా తెలుస్తుంది.
రైల్వే గ్రూఫ్-డి పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
0 Comments