స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో కన్సల్టెంట్ ఉద్యోగాలు, జీతం 1,00,000 రూపాయలు వరకూ, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా,మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1).ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2).ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3).భారీ స్థాయిలో జీతములు.
4). కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాల భర్తీ.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు చెందిన ఉద్యోగాలకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరచబడిన ముఖ్యమైన అంశాలు అన్నిటిని మనం ఇపుడు తెలుసుకుందాం
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం తేది : డిసెంబర్ 21, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 5, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ కన్సల్టెంట్ (పెర్ఫార్మన్స్ మానిటరింగ్ ) - 18
మొత్తం పోస్టులు :
మొత్తం 18 ఉద్యోగాలను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి రెండు సంవత్సరాల ఎంబీఏ/పీజిడీఎం కోర్సులను పూర్తి చేయవలెను.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
55 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతల మార్కుల వెయిటేజ్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 75,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
రైల్వే గ్రూఫ్-డి పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
0 Comments