ఆంధ్రప్రదేశ్ గ్రామ /వార్డ్ సచివాలయాలలో వివిధ విభాగాలలో వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్న ఉద్యోగార్థులకు ఒక శుభవార్త.
అతి త్వరలో ప్రోబెషనరి పీరియడ్ ను పూర్తి చేసుకుని,ఏపీ ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులుగా మారానున్న లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ గ్రామ /వార్డ్ సచివాలయ ఉద్యోగస్తులకు నూతన పీఆర్సీ ను అమలు చేయాలనీ తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా పీఆర్సీ కమిటీ తెలిపింది.
ఏపీ గ్రామ / వార్డ్ సచివాలయ ఉద్యోగుల జీతముల పెంపుపై కీలకమైన అప్డేట్, గరిష్ట జీతం 46,060 రూపాయలు వరకూ ఉంటుంది.
పీఆర్సీ కమిటీ తీసుకున్న తాజా నిర్ణయంతో త్వరలో రెగ్యులర్ కాబోతున్న గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు నూతన పే స్కేల్ లు లభించనున్నాయి. Grama ward Sachivalayam New salary 2022
ఈ ప్రకటన ప్రకారం గ్రామ /వార్డ్ సచివాలయల వివిధ విభాగాలలో వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్న ఉద్యోగస్తులకు ఈ క్రింది విధంగా జీతములు లభించనున్నాయి.
కేటగిరీల ఉద్యోగాలు - జీతములు :
గ్రేడ్ - 5 పంచాయతీ కార్యదర్శులు :
కనిష్ఠ జీతం : 15,030 రూపాయలు
గరిష్ట జీతం : 46,060 రూపాయలు.
గ్రామ సచివాలయాలలో మిగిలిన కేటగిరీల ఉద్యోగాలు - జీతములు :
డిజిటల్ అసిస్టెంట్ /మహిళా పోలీస్ /పశు సంవర్థక శాఖ అసిస్టెంట్ /ఫిషరీస్ అసిస్టెంట్ /ANM/ఇంజనీరింగ్ అసిస్టెంట్ /గ్రేడ్ -2 అగ్రికల్చర్ అసిస్టెంట్ /హార్టికల్చర్ అసిస్టెంట్ /సిరి కల్చర్ అసిస్టెంట్ /విలేజ్ సర్వేయర్ /VRO/వెల్ఫేర్ అసిస్టెంట్స్.
కనిష్ఠ జీతం : 14,600 రూపాయలు.
గరిష్ట జీతం : 44,870 రూపాయలు.
వార్డ్ సచివాలయాల వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ :
కనిష్ఠ జీతం : 15,030 రూపాయలు.
గరిష్ట జీతం : 46,060 రూపాయలు.
వార్డ్ సచివాలయాలలో మిగిలిన కేటగిరీల ఉద్యోగాలు - జీతములు :
వార్డ్ ఏమినిటీస్ సెక్రటరీ /వార్డ్ ఎడ్యుకేషన్ - డేటా ప్రోసేసింగ్ సెక్రటరీ /ప్లానింగ్ అండ్ రెగ్యులరైజెషన్ సెక్రటరీ /శానిటేషన్ అండ్ ఎన్విరాన్ మెంట్ సెక్రటరీ /వెల్ఫేర్ డెవలప్ మెంట్ సెక్రటరీ లు.
కనిష్ఠ జీతం : 14,600 రూపాయలు.
గరిష్ట జీతం : 44,870 రూపాయలు.
తిరుపతిలో ఇంటర్వ్యూలు Click Here
8,10 తరగతులతో కూడా జాబ్స్, 35000 వరకు జీతం Click Here
0 Comments