మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంస్థలో 322 ఉద్యోగాలు, ప్రారంభ జీతం 21,700 రూపాయలు వరకూ,మిస్ కావద్దు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ కోస్ట్ గార్డ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). మంచి స్థాయిలో వేతనాలు.
3). ఇతర అలోవెన్స్ లు కూడా లభిస్తాయి.
4). 10వ తరగతి అర్హతలతో కూడా పోస్టుల భర్తీ.
ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంస్థకు చెందిన ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఇండియా కోస్ట్ గార్డ్ లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జనవరి 4, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 14, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
నావిక్ (డోమెస్టిక్ బ్రాంచ్) | 35 |
యాంత్రిక్ (మెకానికల్ ) | 13 |
యాంత్రిక్ (ఎలక్ట్రికల్ ) | 9 |
యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్ ) | 5 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 322 పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది విద్యా అర్హతలను కలిగి ఉండవలెను.
10వ తరగతి ని పూర్తి చేసిన అభ్యర్థులు నావిక్ (డోమెస్టిక్ ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు మాథ్స్ /సైన్స్ విభాగాలలో ఇంటర్మీడియట్ కోర్స్ లను పూర్తి చేసిన అభ్యర్థులు నావిక్ (జనరల్ డ్యూటీ ) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు 10వ తరగతి ని పూర్తి చేసి ఎలక్ట్రికల్ /మెకానికల్ /ఎలక్ట్రానిక్స్ /టెలి కమ్యూనికేషన్ విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ యాంత్రిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిజికల్ ఫిట్ నెస్ అవసరం అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
18 నుండి 22 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు :
పోస్టుల విభాగాలను అనుసరించి వ్రాత పరీక్ష /ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్/డాక్యుమెంట్ వెరిఫికేషన్ /రీ - అసెస్ మెంట్ టెస్ట్ మరియు మెడికల్ టెస్టుల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 21,700 రూపాయలు నుండి 47,600 రూపాయలు వరకూ జీతం మరియు ఇతర అలోవెన్స్ లు లభించనున్నాయి.
Apply Link : జనవరి 4 వ తేది 2022 లో అందుబాటులో ఉంటుంది.
రైల్వే గ్రూఫ్-డి పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
0 Comments