పరీక్ష లేదు, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,65,000 రూపాయలు వరకూ..
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా & గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక సంయుక్త ఆధ్వర్యంలో ఉన్న బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). ఎగ్జామ్స్ నిర్వహణ లేకుండా పోస్టుల భర్తీ.
3). భారీ స్థాయిలో జీతములు.
4). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
మరియు భారీ స్థాయిలో వేతనాలు లభించే ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు. Metro Jobs Telugu 2022
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : జనవరి 17, 2022 (4PM).
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
చీఫ్ ఇంజనీర్ | 1 |
అడిషనల్/డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ | 2 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (Arch) | 1 |
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిజైన్ | 2 |
మేనేజర్ (Arch) | 1 |
డిప్యూటీ మేనేజర్ (Arch) | 2 |
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిజైన్ | 2 |
అసిస్టెంట్ ఇంజనీర్ - డిజైన్ | 3 |
సెక్షన్ ఇంజనీర్ (Arch) | 2 |
సెక్షన్ ఇంజనీర్ - డిజైన్ | 3 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 19 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
కేటగిరీ లను అనుసరించి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ /యూనివర్సిటీ ల నుండి సంబంధిత విభాగాల సబ్జెక్టులు అనగా సివిల్/ ఆర్చిటెక్చర్ /స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగాలలో బీ. ఈ / బీ. టెక్ /బీ. ఆర్చ్ /డిగ్రీ /డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
విభాగాలను అనుసరించి 35 సంవత్సరాలు నుండి 55 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో వెబ్సైటు నుంచి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, దరఖాస్తు ఫారం ని నింపి, తదుపరి ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫారంనకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు తేదీలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను కూడా ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 40,000 రూపాయలు నుండి 1,65,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :
The General Manager (HR),
Bangalore Metro Rail Corporation Limited,
III Floor, BMTC Complex, K. H. Road,
Shanthinagar,
Bengaluru - 560027.
E-mail Adress :
helpdesk@bmrc.co.in
ముఖ్యమైన గమనిక :అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే అతి ముఖ్యమైన బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 81794 92829
రైల్వే గ్రూఫ్-డి పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
Railway గ్రూఫ్ డి మాక్ టెస్ట్ Click Here
0 Comments