గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న సైనిక్ స్కూల్, కోరుకొండ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). భారీ సంఖ్యలో జీతములు.
3). కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల భర్తీ.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
కోరుకొండ, సైనిక్ స్కూల్ నుండి వచ్చిన ఈ పోస్టుల భర్తీ గురించిన ముఖ్యమైన సమాచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది : ప్రకటన వచ్చిన 21 రోజుల లోపు..
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
మెడికల్ ఆఫీసర్స్ | 1 |
బ్యాండ్ మాస్టర్ | 1 |
హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ | 1 |
వార్డ్ బాయ్స్ | 3 |
మొత్తం పోస్టులు :
మొత్తం 6 పోస్టులను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /ఇన్స్టిట్యూషన్ నుండి ఎంబీబీఎస్ కోర్సులను పూర్తి చేసిన వారు మెడికల్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఏఈసీ ట్రైనింగ్ కాలేజీ లో పోటెన్షియల్ బ్యాండ్ మాస్టర్ /బ్యాండ్ మేజర్ /డ్రమ్ మేజర్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ బ్యాండ్ మాస్టర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి, స్కూల్ /హార్స్ రైడింగ్ క్లబ్ లో హార్స్ రైడింగ్ లో పనిచేసిన అనుభవం ఉన్నవారు హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెట్రిక్యులేషన్ /గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సంబంధిత క్రీడా విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ వార్డ్ బాయ్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
50 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది చిరునామాకు నిర్ణిత గడువు తేది చివరి లోగా ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
300 రూపాయలు ను డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్ / వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 21,060 రూపాయలు నుండి 74,552 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతంతో పాటు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా (అడ్రస్ ) :
The Principal,
Sainik School, Korukonda,
Vizianagaram District,
Andhra Pradesh
Pin Code - 535214
Email Address
ss-korukonda-ap@nic.in
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
0 Comments