Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

TATA Memorial Jobs : జీతం 44,900 రూపాయలు, టాటా మెమోరియల్ సెంటర్ లో ఫుల్ టైమ్ ఉద్యోగాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్టుమెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఉన్న గ్రాంట్ - ఇన్ -ఎయిడ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన టాటా మెమోరియల్ సెంటర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యంశాలు   :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.

2). ఫుల్ టైమ్ విధానంలో భర్తీ చేయనున్నారు.

3). భారీ స్థాయిలో వేతనాలు.

TATA Memorial Jobs

ఈ పోస్టులకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. TATA Memorial Jobs

టీఎంసీ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో ఉన్న ముఖ్యమైన వివరాలను అన్నిటిని మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది   : జనవరి 8, 2022.

విభాగాల వారీగా ఖాళీలు   :

పోస్ట్ లు ఖాళీలు
నర్స్ 'A' 90
నర్స్ 'B' 30
నర్స్ 'C' 55

మొత్తం ఉద్యోగాలు  :

175 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంకాలజీ నర్సింగ్ విభాగంలో జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ ప్లస్ డిప్లొమా లేదా బీ. ఎస్సీ (నర్సింగ్ ) లేదా పోస్ట్ బేసిక్ బీ. ఎస్సీ (నర్సింగ్) కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

మరియు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగాలలో క్లినికల్ ఎక్స్ పీరియన్స్ ఉండవలెను అని మరియు ఇండియన్ /స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండవలెను అని ఈ ప్రకటన లో తెలిపారు.

వయసు  :

కేటగిరీ లను అనుసరించి 40 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మొదట అప్లై చేసుకోవాలి.

తదుపరి, ఆన్లైన్ అప్లికేషన్ ఫారం లను ఈ క్రింది చిరునామా (అడ్రస్ ) కు నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు   :

ఓబీసీ / జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

మిగిలిన కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు :

ఇంటర్వ్యూ /వ్రాత పరీక్ష /స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 44,900 రూపాయలు నుండి 53,100 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ జీతంతో పాటు డీఏ+హెచ్. ఆర్. ఏ +టీ. ఏ+మెడికల్ ఫెసిలిటీ + వసతి + రిటైర్ మెంట్ బెనిఫిట్స్ లాంటి అద్భుతమైన సౌకర్యాలు లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా  :

Recruitment Cell (HRD Department),

1st Floor,

Mahamana Pandit Madan Mohan Malaviya Cancer Centre,

Sunder Bagiya,

BHU Campus, Varanasi,

Uttar Pradesh - 221005.

Website

Notification

వైజాగ్ లో డిసెంబర్ 27 జాబ్ మేళా Click Here

Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here

Post a Comment

1 Comments

  1. మీ యొక్క సందేశాన్ని తప్పనిసరిగా కామెంట్ రాయండి.

    ReplyDelete