ఏపీ లో రేపటి నుండి స్కూల్స్ బంద్..!, మరి కాసేపట్లో స్కూల్స్ మూసివేతపై విద్యా శాఖ నిర్ణయం..? ఇలాంటి వార్తలు ఎన్నో ఇప్పుడు ఏపీ స్కూల్స్ మూసివేత అనే అంశం గురించి సామాజిక మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
మనం ఇంతకు ఈ వార్త నిజమో..? కాదో..? ఒక్కసారి ఫాక్ట్ చెక్ చేద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో స్కూల్స్ ముసివేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రివర్యులు ఇటీవలే అధికారికంగా ఒక ప్రకటన చేశారు.
దేశావ్యాప్తంగా కోవిడ్ థర్డ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంది అనే మాట వాస్తవమే గానీ వైరస్ ప్రభావం మాత్రం తక్కువగానే ఉంది అని,
ఈ తరుణంలో ఏపీ లో పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేసే ప్రసక్తే లేదు అని ఏపీ విద్యా శాఖ మంత్రివర్యులు స్పష్టం చేశారు.
ఒక వేళ ఏదైనా స్కూల్ లేదా కాలేజీ లలో కరోనా కేసులు నమోదు అయితే కనుక ఆ ఒక్క పాఠశాల / కాలేజీ ను మాత్రమే మూసివేసి, మిగిలిన స్కూల్స్ / కాలేజీ లను యధావిధిగా కొనసాగిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రివర్యులు ఏపీ స్కూల్స్ మూసివేత అంశంపై అధికారిక ప్రకటన చేశారు.
మంత్రి గారు చేసిన తాజా ప్రకటనను బట్టి మనం ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ మరియు కాలేజీలు కరోనా నేపథ్యంలో సెలవులు ఇచ్చేది లేదు అని తెలుసుకోవచ్చు.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments