Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

TTD Jobs Recruitment 2022 : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు, జీతం 28940-78,910 రూపాయలు

TTD లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న వారికి తిరుమల అధికారిక వెబ్‌సైట్ లో నోటిఫికేషన్ కనిపిస్తుంది.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) లో ఖాళీగా ఉన్న ట్రాన్స్ లేటర్ పోస్ట్ భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు : 

1). ఇవి టీటీడీ బోర్డ్ కు సంబంధించిన ఉద్యోగాలు.

2). భారీ స్థాయిలో వేతనాలు.

3). పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో తెలిపారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో  పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

తిరుమల  నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది   :     మే 2, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

ట్రాన్స్ లేటర్, టీటీడీ              -       1

మొత్తం ఖాళీలు :

ఓసీ రిజర్వేషన్ కు ఈ ఒక్క పోస్టును కేటాయించడం జరిగింది.

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ తెలుగు కోర్సులను పూర్తి చేసి, ఇంగ్లీష్ భాష నుండి తెలుగు భాషలోనికి ట్రాన్స్ లేటర్ గా ఏదైనా సంస్థలో ఐదు సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలని, పీహెచ్. డీ కోర్సులను అడిషనల్ క్వాలిఫీకేషన్ గా ఉన్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బోర్డు గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ తమ దరఖాస్తు ఫారం లను సరైన వివరాలతో నింపి, తదుపరి అప్లికేషన్ ఫారంనకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేది లోగా ఈ క్రింది అడ్రస్ (చిరునామా) కు పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ/వ్రాత పరీక్షల ఆధారంగా ఈ పోస్టుకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి నెలకు జీతంగా 28,940 రూపాయలు నుండి 78,910 రూపాయలు వరకూ జీతం అందనుంది.

జతపరచవల్సిన డాక్యుమెంట్స్ :

బయోడేటా

ప్రూఫ్ ఆఫ్ ఏజ్,

ఎడ్యుకేషనల్ క్వాలిఫీకేషన్స్ సర్టిఫికెట్స్,

మార్క్స్ స్టేట్ మెంట్స్

ఎక్స్పీరియన్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్స్,

మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు మొదలైనవి.

Note : పై విద్యా ధ్రువీకరణ పత్రాల ఫోటో కాపీలపై  గేజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :

To The Executive Officer,

T. T. D., K. T. ROAD, Tirupati.

Website

Notification

Post a Comment

0 Comments