ఇంటర్ మరియు డిగ్రీ విద్యా అర్హతలతో APSSDC ఉద్యోగాలు మొబైల్ ఫోన్ లో ఇంటర్వ్యూలు. విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయనగరం, అమలాపురం నగరాల్లో ఉద్యోగాలు.
ఇంటర్ మరియు డిగ్రీ విద్యా అర్హతలను పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు APSSDC ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.
క్యూస్ (Quess) కార్పొరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్స్ మరియు ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా విడుదల అయినది. APSSDC Degree Jobs Apply Now
ఎటువంటి పరీక్షలు లేకుండా, గూగుల్ మీట్ వర్చ్యువల్ ఇంటర్వ్యూ ల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఎటువంటి పరీక్షలు లేకుండా, ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
APSSDC ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ /పని తీరు ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ (లేదా) పని కాలవ్యవధి సమయం పొడగింపు చేసే అవకాశం కలదు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయనగరం మరియు అమలాపురం నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : జూన్ 25 , 2021
విభాగాల వారీగా ఖాళీలు :
రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్స్ మరియు బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్స్ (SBI కార్డ్స్ ) - 100
జూనియర్ రిలేషన్ షిప్ ఆఫీసర్స్ (హోం & పర్సనల్ లోన్స్ - ఆక్సిస్ బ్యాంక్ ) - 40
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదల అయిన ఈ ప్రకటన ద్వారా మొత్తం 140 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఇంటర్మీడియట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకి ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చునని ప్రకటనలో పొందుపరిచారు.
జూనియర్ రిలేషన్ షిప్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు బైక్, లైసెన్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ ఉండవలెను అని తెలుపుతున్నారు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ నోటిఫికెషన్ లో తెలిపారు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
గూగుల్ మీట్ వర్చ్యువల్ ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతం 10,000 రూపాయలు నుండి 15,000 రూపాయలు వరకూ అందనుంది.
ఈ జీతంతో పాటు ఇన్సెంటివ్స్ + ఈఎస్ఐ (ESI)+ప్రొవిడెంట్ ఫండ్ (PF) లాంటి మంచి బెనిఫిట్స్ కూడా ఉద్యోగార్థులకు లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9703460880
1800-425-2422
3 Comments
వెబ్సైట్ ని ప్రతి రోజు చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు, కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. ఈ పోస్ట్ మీకు నచ్చితే good job అని కామెంట్ రాయండి.
ReplyDeletegood job
Deleteవెబ్సైట్ ని ప్రతి రోజు చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు, కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. ఈ పోస్ట్ మీకు నచ్చితే good job అని కామెంట్ రాయండి.
ReplyDelete