గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC), మైసూర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
మంచి స్థాయి వేతనాలు మరియు ఇతర అలోవెన్స్ లు లభించే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు
తక్కువ విద్యా అర్హతలు మరియు ఆసక్తికరమైన జీతములు అందే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : అక్టోబర్ 15, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
డ్రైవర్ , పంప్ ఆపరేటర్, ఫైర్ మాన్ - 16
సబ్ ఆఫీసర్స్ - 4
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 20 పోస్టులను తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి 10వ తరగతి / ఇంటర్ లను అభ్యర్థులు పూర్తి చేసి ఉండవలెను.
మరియు కొన్ని కేటగిరీ ల పోస్టులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ , ఫైర్ కోర్సు సర్టిఫికెట్స్ ను కలిగి ఉండి, నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
కేటగిరీ లను అనుసరించి ఉన్న ఈ పోస్టులకు 18 నుండి 40 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి ..?
ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫారం ను నింపిన తరువాత, సంబంధిత విద్యా అర్హతలు మరియు ఇతర ధ్రువీకరణ పత్రాలను జతపరిచి నిర్ణిత గడువు తేదీలోగా ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఫీజికల్ టెస్ట్ / డ్రైవింగ్ టెస్ట్ మరియు వ్రాత పరీక్ష ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 21,700 రూపాయలు నుండి 35,400 రూపాయలు వరకూ నెలకు జీతం లభించనుంది.
ఈ జీతంతో పాటు ఇతర ముఖ్యమైన అలోవెన్స్ లు కూడా వీరికి లభించనున్నాయి .
దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
Administrative officer - III
Bhabha Atomic Research Center,
P. B. No : 1 , Yelwal ( PO ),
Mysuru - 571130.
పరీక్ష లేదు, ఏపీ అంగన్వాడీ లో ప్రభుత్వ ఉద్యోగాలు
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,20,000
0 Comments