3000 కు పైగా ఉద్యోగాలు,తిరుపతిలో మెగా జాబ్ డ్రైవ్ , APSSDC ఆధ్వర్యంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి నగరంలో భారీ సంఖ్యలో 3000 కు పైగా ఉద్యోగాలతో మెగా జాబ్ డ్రైవ్ ను నిర్వహించి, తద్వారా పలు ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న పలు విభాగాల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక అతి ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది.
ముఖ్యంశాలు :1). ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ APSSDC ఆధ్వర్యంలో జరుగును.
2). గౌరవ స్థాయిలో జీతం అందనుంది.
3).ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
4). పదవ తరగతి అర్హతలతో కూడా ఉద్యోగాలు.
APSSDC ఆధ్వర్యంలో భర్తీ కాబోయే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు. AP Mega Job Mela 20000 Salary
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ, చిత్తూరు మరియు తిరుపతి, రేణిగుంట,నాయుడుపేట, గాజులమాంద్యం,పెనుకొండ, మదనపల్లి, మరియు నెల్లూరు జిల్లా మరియు చెన్నై, బెంగళూరు నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
తిరుపతి లో నిర్వహించనున్న ఈ మెగా జాబ్ డ్రైవ్ కు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
జాబ్ డ్రైవ్ నిర్వహణ తేది : డిసెంబర్ 23, 2021
జాబ్ డ్రైవ్ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
SDHR డిగ్రీ & పీజీ కాలేజీ, న్యూ బాలాజీ కాలనీ, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
జాబ్ డ్రైవ్ లో పాల్గొనే సంస్థలు :
ఆల్ట్రస్ట్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్
సినర్జీ రెమెడీస్ ప్రయివేట్ లిమిటెడ్
కియా ఇండియా
ఇసుజు మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్
గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్
అపోలో ఫార్మసీ
అమర్ రాజా గ్రూప్
డీ - మార్ట్
అల్ డిక్సన్
భారత్ FIH లిమిటెడ్
1పాయింట్ 1 సొల్యూషన్స్ లిమిటెడ్
భారత్ మాట్రిమోనీ
అల్ సెక్ టెక్నాలజీస్ లిమిటెడ్
స్టార్ హెల్త్ అండ్ అల్లిడ్ ఇన్సూరెన్స్
పైసా బజార్ మార్కెటింగ్ అండ్ కన్సుల్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్
ఇస్కోన్ ఎక్స్ పీరియన్స్ లిమిటెడ్
జెమినీసిస్ గ్రూప్
ఫ్యూషన్ బీపీవో సర్వీసెస్
హ్యుందాయ్ మొబైస్
ఎయిర్టెల్ పే మెంట్స్ బ్యాంక్
SBI కార్డు
శ్రీ రామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్
టాలెంట్ ప్రో(KVB)
బెస్ట్ ఇన్సూరెన్స్
టాలెంట్ ప్రో(HDFC)
క్విక్ అప్ ఇన్నోవేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్
జస్ట్ డైయల్
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
టెక్ సపోర్ట్ | 50 |
ప్రొడక్షన్ /క్వాలిటీ etc | 29 |
నీమ్ ట్రైనీస్ | 200 |
నీమ్ ట్రైనీస్ | 100 |
ట్రైనీ ఆపరేటర్ | 150 |
ఫార్మసీస్ట్ /ట్రైనీస్ | 60 |
మెషిన్ ఆపరేటర్ | 350 |
సేల్స్ అసోసియేట్స్ | 20 |
క్యాషియర్స్ | 15 |
పికర్స్ & పాకెర్స్ | 15 |
సీసీ కెమెరాస్ అసెంబ్లీంగ్ ఆపరేటర్స్ | 100 |
అసెంబ్లీ లైన్ హెల్పర్స్ | 500 |
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | 950 |
ప్రొడక్షన్ | 100 |
ఫీల్డ్ సేల్స్ ప్రమోటార్స్ | 20 |
రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ | 35 |
టీమ్ లీడర్స్ | 5 |
బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ | 30 |
రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ | 20 |
సేల్స్ ఎగ్జిక్యూటివ్ | 14 |
టెలి కాలర్స్ /మార్కెటింగ్ ఏజెంట్ | 10 |
బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ | 100 |
డెలివరీ ఎగ్జిక్యూటివ్ | 25 |
సర్టిఫిడ్ ఇంటర్నెట్ కన్సల్టెంట్ | 100 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 3008 ఉద్యోగాలను ఈ జాబ్ డ్రైవ్ ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.
అర్హతలు :
10వ తరగతి /ఇంటర్మీడియట్ /డిగ్రీ /పీజీ /బీ. టెక్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ జాబ్ డ్రైవ్ కు హాజరు కావచ్చు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ప్రకటనలో పొందుపరిచారు.
అభ్యర్థులు అందరికి తెలుగు /ఇంగ్లీష్ & హిందీ భాషలు తెలిసి ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల విధానముల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
కొన్ని విభాగాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ జీతంతో పాటుగా పీ. ఎఫ్+ బోనస్ +ఈఎస్ఐ+ఇంక్రిమెంట్స్+లీవ్ బెనిఫిట్స్ +గ్రాట్యుటీ +అవార్డ్స్ +రివార్డ్స్ +ప్రమోషన్స్ తదితర విలువైన ఇతర బెనిఫిట్స్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి.
Note :
ఈ జాబ్ డ్రైవ్ కు హాజరు కాబోయే అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ లను ధరించి, తమ తమ రెస్యూమ్స్ + ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ జీరాక్స్ కాపీ లు మరియు ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు ఓటర్ ఐడి కార్డు లను తమ వెంట తీసుకుని రావలెను అని ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ - 19 ప్రోటోకాల్స్ ను అభ్యర్థులు అందరూ తప్పకుండా పాటించాలని ఈ ప్రకటనలో తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9381109098
9493923124
8121984014
8886086072
9988853335
రైల్వే గ్రూఫ్-డి పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
Railway గ్రూఫ్ డి మాక్ టెస్ట్ Click Here
0 Comments