పదవ తరగతి తో 641 కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు, ప్రారంభ జీతం జీతం 21,700 రూపాయలు వరకూ, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ఇన్స్టిట్యూట్ లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ (T-1) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన భారీ నోటిఫికేషన్ ను తాజాగా ది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI) తాజాగా విడుదల చేసినది.
తప్పనిసరిగా మీ ప్రెండ్స్ కి ఈ జాబ్ నోటిఫికేషన్ ని షేర్ చెయ్యండి.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). రెగ్యులర్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
4). గౌరవ స్థాయిలో ప్రారంభ వేతనములు.
ఆన్లైన్ పరీక్షల ఆధారంగా భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు చెందిన పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఆసక్తి కలిగిన అర్హతలు కలిగిన ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో తెలిపారు. ICAR 641 Jobs only 10th Apply Now
అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేయనున్న ఈ పోస్టుల నోటిఫికేషన్ గురించిన సమగ్రమైన సమాచారాన్ని మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : డిసెంబర్ 18, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 10, 2022
ఫీజు పేమెంట్స్ కు చివరి తేది : జనవరి 10, 2022
ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైపు పరీక్ష నిర్వహణ తేది : జనవరి 25,2022 - ఫిబ్రవరి 5, 2022 మధ్య తేదీలలో..
విభాగాల వారీగా ఖాళీలు :
టెక్నీషియన్స్ (T-1) - 641
మొత్తం పోస్టులు :
మొత్తం 641 టెక్నీషియన్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు నుండి 60% మార్కులతో మెట్రిక్యులేషన్ కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
యూఆర్/ఓబీసీ/EWS కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ బిట్స్ తో కూడిన పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష కాలవ్యవధి 90 నిముషాలుగా ఉండనుంది.
పరీక్ష యొక్క సిలబస్ ఈ క్రింది విధంగా ఉంది.
NOTE :
ఎక్సమినేషన్ - సిలబస్ :
జనరల్ నాలెడ్జ్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
మాథ్ మెటిక్స్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
సైన్స్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
సోషల్ సైన్స్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతంగా 7th సీపీసీ పే మెట్రిక్స్ విధానంలో 21,700 రూపాయలు వరకూ జీతం మరియు ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
పరీక్ష కేంద్రములు - నగరాలు :
ఇరు తెలుగు రాష్ట్రాలలోని అభ్యర్థులు ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రములుగా ఆప్షన్స్ ను ఎంచుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ :
చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూల్, మచిలీపట్నం, నంద్యాల, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, విజయనగరం.
తెలంగాణ :
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్.
రైల్వే గ్రూఫ్-డి పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
Railway గ్రూఫ్ డి మాక్ టెస్ట్ Click Here
0 Comments