గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు చెందిన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ లేబర్యాటరీ (DEAL), డెహ్రడూన్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అప్ప్రెంటీస్ పోస్టులు.
2). ఈ అప్ప్రెంటీస్ షిప్ భవిష్యత్తు లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఖచ్చితంగా సహకరిస్తుంది.
3). ఆకర్షణీయమైన స్టై ఫండ్స్ లభిస్తాయి.
పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా, ఈ కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇది DRDO లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక మంచి సువర్ణవకాశంగా మనం చెప్పుకోవచ్చును.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు. DRDO Jobs Recruitment 2021
DRDO నుండి వెలువడిన ఈ ప్రకటనలో ఇచ్చిన మరిన్ని అంశాలను మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 31, 2021
ఉద్యోగాలు - వివరాలు :
డిగ్రీ అప్ప్రెంటీస్ ట్రైనీస్ - 19
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్‌లు | ఖాళీలు |
---|---|
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 17 |
మెకానికల్ ఇంజనీరింగ్ | 1 |
కంప్యూటర్ సైన్స్ /కంప్యూటర్ ఇంజనీరింగ్ | 1 |
మొత్తం పోస్టులు :
తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలను అనుసరించి సబ్జెక్టు విభాగాలలో డిగ్రీ కోర్సులను 2018/2019/2020 సంవత్సరంలో పూర్తి చేసి ఉండవలెను.
వయసు :
18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను. ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులును చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా కేవలం విద్యా అర్హతల మార్కుల మెరిట్ ను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన స్టై ఫండ్స్ నెలకు 9,000 రూపాయలు వరకూ లభించనున్నాయి.
తిరుపతి లో ఉద్యోగాలు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments