గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో ఉన్న మినీరత్న కంపెనీ అయిన సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో
వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). తక్కువ విద్యా అర్హతలతోనే పోస్టుల భర్తీ.
2). పరీక్షల నిర్వహణ లేదు.
3). ఆకర్షణీయమైన స్టై ఫండ్స్ ఇవ్వబడును.
4). ఈ అప్ప్రెంటీస్ షిప్ అనునది భవిష్యత్తులో చేపట్టబోయే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో సహకరిస్తుంది.
విద్యా అర్హతల మెరిట్ ను అనుసరించి చేపట్టబోయే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లో భర్తీ కాబోయే ఈ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు తెలుసుకుందాం. Coal India Limited Recruitment
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : నవంబర్ 20, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 5, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ఎలక్ట్రీషియన్ - 190
ఫిట్టర్ - 150
మెకానిక్ రిపేర్ /మెయింటనెన్స్ ఆఫ్ వెహికల్ - 50
COPA - 20
మెషినిస్ట్ - 10
టర్నర్ - 10
ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ - 10
ప్లంబర్స్ - 07
ఫోటోగ్రాఫర్స్ - 03
ఫ్లోరిస్ట్ & ల్యాండ్ స్కేపర్ - 05
బుక్ బైండర్ - 02
కార్పెంటర్ - 02
డెంటల్ లేబర్యాటరీ టెక్నీషియన్ - 2
ఫుడ్ ప్రొడక్షన్ - 1
ఫర్నిచర్ & కాబినేట్ మేకర్ - 2
గార్డనర్ ( మెయిల్ ) - 10
హార్టికల్చర్ అసిస్టెంట్ - 5
ఓల్డ్ ఏజ్ కేర్ టేకర్ - 2
పెయింటర్ (జనరల్ ) - 2
రిసెప్షనిస్ట్ /హోటల్ క్లర్క్ /ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ - 2
స్టీవార్డు - 6
టైలర్ - 2
అప్ హాల్స్ స్టరర్ - 1
సెక్రటరియేట్ అసిస్టెంట్ - 5
సిర్డర్ - 10
అకౌంటెంట్ / అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్ - 30
మొత్తం పోస్టులు :
తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా మొత్తం 539 అప్ప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
10వ తరగతి / ఇంటర్మీడియట్ /సంబంధిత ట్రేడ్స్ విభాగాలలో ఐటిఐ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెంట్రల్ గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
విద్యా అర్హతల మార్కుల మెరిట్ ను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన స్టై ఫండ్స్ లభించనున్నాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు Clik Here
APPSC ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు Clik Here
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here
0 Comments