Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Anganwadi Jobs : అంగన్‌వాడి లో 11,500 జీతం తో ఉద్యోగాలు

10వ తరగతి అర్హతతో 11,500 రూపాయలు జీతం, ఉన్న ఊరి లోనే ఉద్యోగాలు, 340 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ, వెంటనే అప్లై చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని 16 ఐసీడిఎస్ ప్రాజెక్ట్ లలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నియామక ప్రకటనను తాజాగా అనంతపురం జిల్లా - జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ విడుదల చేసినది.

Anganwadi Jobs

1). సొంత ఊరిలోనే ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వీలు.

2). అతి తక్కువ విద్యా అర్హతలతో పోస్టుల భర్తీ.

3). గౌరవ స్థాయిలో వేతనాలు.

4).పరీక్షల నిర్వహణ లేకుండా ఉద్యోగాల భర్తీ.

కేవలం 10వ తరగతి అర్హతలతో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హతలు గల లోకల్ జిల్లా లో ఉన్న స్థానిక వివాహిత మహిళలు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. Anganwadi Jobs

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సొంత గ్రామంలోనే పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఏపీ రాష్ట్రంలో తాజాగా వచ్చిన ఈ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

నోటిఫికేషన్ విడుదల తేది       : డిసెంబర్ 6,2021

దరఖాస్తులకు ప్రారంభం తేది : డిసెంబర్ 6,2021.

దరఖాస్తులకు ముగింపు తేది:  డిసెంబర్ 16,2021.

ఉద్యోగాలు  -  వివరాలు  :

అంగన్వాడీ కార్యకర్త

మినీ అంగన్వాడీ కార్యకర్త

అంగన్వాడీ సహాయకులు

ప్రాంతముల వారీగా ఖాళీలు   :

పోస్ట్‌లు ఖాళీలు
అనంతపురం (అర్బన్ ) 27
CK పల్లి 11
ధర్మవరం 22
గూటీ 17
హిందూ పూర్ 42
కణేకల్ 11
కళ్యాణ్ దుర్గ్ 20
కంబదూర్ 16
కదిరి (E) 16
కుదర్ 17
మడకశిర 40
పెను కొండ 38
రాయదుర్గ్ 14
సింగనమల 21
తాడిపత్రీ 9
ఉరవకొండ 23

మొత్తం ఉద్యోగాలు  :

మొత్తం 365 పోస్టులు ఉండగా, తాజాగా చేపడుతున్న ఈ నియామాకలలో 340 ఉద్యోగాలను నోటి ఫై చేశారని ప్రకటనలో తెలిపారు.

ఈ పోస్టుల సంఖ్య పెంచవచ్చు / తగ్గించవచ్చు అనే సూచనలను కూడా ఈ ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.

అర్హతలు  :

10వ తరగతి లో ఉత్తిర్ణత చెంది, స్థానికంగా ఉన్న వివాహిత మహిళా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ నోటిఫికేషన్ లో తెలిపారు.

వయసు  :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలు వయసు ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తు ఫారం తో పాటు, కుల, నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, వికలాంగత్వమునకు సంబంధించిన పత్రములను జతపరిచి గేజిటెడ్ ఆఫీసర్ చే అటెస్టెడ్ చేయించి ఈ క్రింది చిరునామాకు నిర్ణిత చివరి గడువు తేదీలోగా అందచేయవలెను.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతలు /మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మరియు అభ్యర్థులు CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను అని ప్రకటనలో పొందుపరచడం జరిగింది.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 11,500 రూపాయలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకులకు 7,000 రూపాయలు జీతం చెల్లించబడుతుంది.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :

ప్రాజెక్ట్ డైరెక్టర్,

డిస్ట్రిక్ట్ వుమన్ అండ్ చైల్డ్ ఏజెన్సీ,

అనంతపూర్,

ఆంధ్రప్రదేశ్.

Website

Notification 

మీకు తెలుసా మూడు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు Click Here

రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here

5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here

బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here 


Post a Comment

0 Comments