Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP and TS Full Job Information Telugu : ఏపి మరియు తెలంగాణ లో 16 ప్రభుత్వ సంస్థలలో వచ్చిన ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రభుత్వ మరియు ఇతర ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ రోజు ఈ ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

అవి: 

1) సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు,

2) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

3) పరీక్ష లేదు, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో 1044 అప్ప్రెంటీస్ పోస్టులు

4) ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో 462 ఉద్యోగాలు, జీతం 44,900 రూపాయలు

5) ఏపీ ఎడ్ సెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల,శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, తిరుపతి

6) NIFT లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు

7) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు, రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై కూ అర్హులే

8) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లో వెల్డర్ ఉద్యోగాలు, నెలకు 37,500 రూపాయలు జీతం

10) ఉద్యోగాల భర్తీపై SSC కీలక ప్రకటన, అస్సలు మిస్ కావద్దు

11) పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 1,20,000 రూపాయలు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం

12) UGC NET 2022 పై అతి ముఖ్యమైన ప్రకటన

13) IRCON లో ఉద్యోగాల భర్తీ అస్సలు మిస్ కాకండి

14) DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు, జీతం 31,000 రూపాయలు

15) Ministry of Defence DEBEL Jobs 2022

16) APPSC AE 190 ఉద్యోగాల పై అతి ముఖ్యమైన ప్రకటన

వీటి గురించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందా ఇంగ్లీష్ భాషలో నోటిఫికేషన్ చూడాలి అనుకునే వారు నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చెయ్యంది. 

1) సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు :

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్య అంశాలు  :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3). భారీ స్థాయిలో వేతనాలు.

4). ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు బేసిస్ విధానంలో భర్తీ.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

సీసీఐఎల్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలు అన్నిటిని ఒక్కసారి పరిశీలిద్దాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది   :  మే  31, 2022 ( 5 PM ).

విభాగాల వారీగా ఖాళీలు   :

ఇంజనీర్ - ప్రొడక్షన్                  -     8

ఇంజనీర్ - మెకానికల్               -     5

ఇంజనీర్ - సివిల్                      -     3

ఇంజనీర్ - మైనింగ్                   -     3

ఇంజనీర్ -  ఇన్స్ట్రుమెంటేషన్  -     4

ఇంజనీర్ -  ఎలక్ట్రికల్                -    4

ఆఫీసర్ - మెటీరియల్ మేనేజ్మెంట్ -  3

ఆఫీసర్ - మార్కెటింగ్                  -   2

ఆఫీసర్ - ఫైనాన్స్ & అకౌంట్స్       -   4

ఆఫీసర్ - హ్యూమన్ రిసోర్స్        -   2

ఆఫీసర్ - కంపెనీ సెక్రటరీ               -  1

ఆఫీసర్ -  రాజభాష అధికారి         -  1

ఆఫీసర్ - లీగల్                             -  4

చార్టెర్డ్ అకౌంటెంట్                          -  1

కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటెంట్         -  1

మొత్తం పోస్టులు  :

46 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ / ఎంబీఏ ( మార్కెటింగ్ ) / సీఏ/icwa/ఎంబీఏ (ఫైనాన్స్ )/ పీజీ డిగ్రీ /డిప్లొమా /msw ఇన్ హెచ్. ఆర్/పర్సనల్ మేనేజ్మెంట్ /లేబర్ వెల్ఫేర్ /ఐఆర్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ /గ్రాడ్యుయేట్ విత్ త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎల్. ఎల్. బీ/ ఫైనల్ ఎక్సమినేషన్ ఆఫ్ సీఏ పాస్ / icwa పాస్ మొదలైన కోర్సులు కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు  :

35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆఫ్ లైన్ విధానంలో నిర్ణిత గడువు చివరి తేదీలోగా అభ్యర్థులు తమ తమ దరఖాస్తు ఫారం లను సంబంధిత చిరునామాకు పంపవలెను.

దరఖాస్తు ఫీజు   :

యూ. ఆర్ / ఓబీసీ /ews కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎస్సీ/ఎస్టీ /దివ్యంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

 షార్ట్ లిస్ట్,  ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 40,000 రూపాయలు మరియు ఇతర అలోవెన్స్ లు 10,000 రూపాయలు పైన లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :

Manager (HR),

Cement Corporation of India Limited,

Post Box No : 3061,

Lodhi Road Post Office,

New Delhi - 110003

Website

Notification

2) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

మహరత్న కంపెనీ గా పిలువబడే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1).ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

2).భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు అర్హులే అని ప్రకటనలో  తెలిపారు.

ఐఓసీఎల్  ద్వారా జారీ అయిన ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ అప్లికేషన్స్ కు  ప్రారంభం తేది     :   మే 7, 2022

ఆన్లైన్ అప్లికేషన్స్ కు  చివరి తేది             :   మే 28, 2022

ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తులు చేరుటకు చివరి తేది  :  జూన్ 18, 2022.

ఈ మెయిల్ విధానం ద్వారా దరఖాస్తులు చేరుటకు చివరి తేది :  జూన్ 19, 2022.

వ్రాత పరీక్ష నిర్వహణ తేది                   :  జూన్ 19, 2022

పరీక్ష ఫలితాల విడుదల తేది               :  జూన్ 29, 2022

వ్రాత పరీక్ష నిర్వహణ ప్రదేశం               :  న్యూ ఢిల్లీ.

విభాగాల వారీగా ఖాళీలు    :

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV ( ప్రొడక్షన్ )                -    18

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV ( ఇన్స్ట్రుమెంటేషన్)  -      1

మొత్తం ఉద్యోగాలు  :

తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి 45% లేదా 50% మార్కులతో   మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ కెమికల్ /రీఫైనరీ & పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ లేదా బీ. ఎస్సీ (మాథ్స్ /ఫిజిక్స్ /కెమిస్ట్రీ /ఇండస్ట్రీయల్ కెమిస్ట్రీ ) కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV ( ప్రొడక్షన్ ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ / ఇన్స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజనీరింగ్ కోర్సులను కంప్లీట్ చేసిన వారు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ - IV ( ఇన్స్ట్రుమెంటేషన్) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

18 నుండి 26 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?  

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అనంతరం ఈ అప్లికేషన్స్ ఫారం ను సంబంధిత చిరునామాకు ఆఫ్ లైన్ విధానంలోనూ మరియు ఈ - మెయిల్ అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదిలోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు..?

వ్రాత పరీక్ష  మరియు స్కిల్ / ప్రోఫీషియాన్సీ /ఫీజికల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000 నుండి 1,05,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

దరఖాస్తులను పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) : 

Post Box No. 128,

Panipat Head Post office,

Panipat, Haryana - 132103.

దరఖాస్తులను పంపవల్సిన ఈ - మెయిల్ అడ్రస్  :

prpcrecruitment@indianoil.in

Website

Apply Link

Notification

3) పరీక్ష లేదు, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో 1044 అప్ప్రెంటీస్ పోస్టులు: 

ఇండియన్ రైల్వేస్ చెందిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది

ముఖ్యాంశాలు:

1). ఇవి రైల్వే శాఖకు చెందిన పోస్టులు.

2). ఎటువంటి పరీక్షలు లేకుండానే పోస్టుల భర్తీ.

3). ఆసక్తి కరమైన స్టై ఫండ్.

4). భారీ సంఖ్యలో అప్ప్రెంటీస్ షిప్ లు.

5).ఈ అప్ప్రెంటీస్ షిప్ సర్టిఫికెట్ భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేయనున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పోస్టుల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

 మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అని తెలుస్తుంది.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే  బోర్డు నుండి  జారీ అయిన ఈ అప్ప్రెంటీస్ షిప్ పోస్టులకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది   :   మే 4, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది           :   జూన్  3, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

నాగపూర్ డివిజన్   :

ఫిట్టర్                     -       183

కార్పెంటర్               -      56

వెల్డర్                      -       85

COPA                    -         50

ఎలక్ట్రీషియన్       -      160

స్టేనోగ్రాఫర్ (ఇంగ్లీష్ ) -        15

ప్లంబర్                       -        45

పెయింటర్                -        59

వైర్ మెన్                     -       60

ఎలక్ట్రానిక్స్ మెకానిక్  -       06

మెకానిక్ మెషిన్           -      10

డీజిల్ మెకానిక్             -    122

అప్ హోల్ స్టెరేర్(ట్రీమ్మర్) -     6

డ్రైవర్ కమ్ మెకానిక్       -      5

మెషినిస్ట్                          -    30

డిజిటల్ ఫోటోగ్రాఫర్      -     02

టర్నర్                             -    20

డెంటల్ లేబర్యాటరీ టెక్నీషియన్ - 5

హాస్పిటల్ వేస్ట్ మానేజ్మెంట్ టెక్నీషియన్   -   5

హెల్త్ సానిటరీ ఇన్స్పెక్టర్       -   5

గ్యాస్ కట్టర్                          - 15

స్టేనోగ్రాఫర్ ( హిందీ)               -15

కేబుల్ జాయింటర్                 -  3

మాసన్                                  - 18

మోతి బాగ్ డివిజన్  :

ఫిట్టర్               -      33

వెల్డర్                -       9

కార్పెంటర్          -     12

పెయింటర్          -      5

టర్నర్                 -      2

సెక్రటరియల్ ప్రాక్టీస్ -   3

మొత్తం ఉద్యోగాలు  :

ఈ ప్రకటన ద్వారా మొత్తం 1044 రైల్వే అప్ప్రెంటీస్ షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డుల నుండి 50% మార్కులతో  10వ తరగతి /10+2 లో ఉత్తీర్ణతలను సాధించి ఉండవలెను.

మరియు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత ట్రేడ్స్ లలో  ఐటీఐ కోర్సులను పూర్తి చేయవలెను అని ప్రకటనలో తెలిపారు.

వయసు   :

15 నుండి 24 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ  /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు   :

అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులు  చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం   :

విద్యార్హతల మార్కుల పెర్సెంటేజ్  ఆధారంగా మరియు మెడికల్ టెస్ట్ నిర్వహణల ఆధారంగా  ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షణీయమైన  స్టై ఫండ్ లు లభించనున్నాయి.

South Central Railway website Link

Notification

4) ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో 462 ఉద్యోగాలు, జీతం 44,900 రూపాయలు:

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ఐసీఏఆర్ - ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ), న్యూ ఢిల్లీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

ముఖ్య అంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

3). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు దేశావ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్  రీజనల్ స్టేషన్స్ లో పోస్టింగ్స్ కల్పించనున్నారు.

ఐసీఏఆర్ - ఐఏఆర్ఐ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన విషయాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది   :  మే 7, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది           : జూన్ 1, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

అసిస్టెంట్ ( ఐసీఏఆర్ హెడ్ క్వార్టర్స్ )    -     71

అసిస్టెంట్ ( ఐసీఏఆర్ ఇన్స్టిట్యూట్స్)    -   391

మొత్తం పోస్టులు :

462 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు  :

20 - 30 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు  దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

టెస్ట్ / ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,000 నుండి 44,900 రూపాయలు వరకూ జీతం మరియు ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.

Website

Notification

Apply Link

5) ఏపీ ఎడ్ సెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల,శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, తిరుపతి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీ. ఎడ్ కోర్సుల ప్రవేశంనకు సంబంధించిన ఏపీ ఎడ్ సెట్ నోటిఫికేషన్ - 2022 తాజాగా విడుదల అయినది.

2022-23 అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన రెగ్యులర్ బీ. ఎడ్ మరియు బీ. ఎడ్ స్పెషల్ రెండు సంవత్సరాలు కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఎడ్ సెట్ - 2022 ) నోటిఫికేషన్, శ్రీ పద్మావతి మహిళా విద్యాలయం, తిరుపతి నుండి ప్రకటించబడినట్లుగా తెలుస్తుంది.

ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది    :   మే 9, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది            :  జూన్ 7, 2022

ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ తేది               :  జూలై 13, 2022

దరఖాస్తు ఫీజు  :

ఈ ఎంట్రన్స్ టెస్ట్ కు ఓసీ కేటగిరీ అభ్యర్థులు 650 రూపాయలు, బీసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 450 రూపాయలు ను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.

ఎలా అప్లై చేసుకోవాలి:

అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా ఏపీ ఎడ్ సెట్ - 2022 కు దరఖాస్తు చేసుకోవచ్చు.

6) NIFT లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ట్ టైల్స్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్య అంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇవి గ్రూప్ సీ విభాగానికి చెందిన ఉద్యోగాలు.

3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

4). రెగ్యులర్ బేసిస్ లో పోస్టుల భర్తీ.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అని ఈ ప్రకటనలో తెలిపారు.

నిఫ్ట్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది  :  మే 16, 2022 ( 5:30 PM).

విభాగాల వారీగా ఖాళీలు   :

అసిస్టెంట్ వార్డెన్ ( బాయ్స్ )         -     1

అసిస్టెంట్ వార్డెన్ ( గర్ల్స్ )             -     1

నర్స్                                            -     1

జూనియర్ అసిస్టెంట్                    -     7

మెషిన్ మెకానిక్                            -    3

ల్యాబ్ అసిస్టెంట్                            -   6

మొత్తం పోస్టులు  :

19 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులు అసిస్టెంట్ వార్డెన్ ( బాయ్స్ / గర్ల్స్ ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీ. ఎస్సీ ( హాన్స్.) ఇన్ నర్సింగ్ కోర్సులు / రెగ్యులర్ కోర్సు ఇన్ బీ. ఎస్సీ ( నర్సింగ్ ) / డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ కోర్సులను  పూర్తి చేసి, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ లేదా నర్స్ మరియు మిడ్ వైఫరీ కోర్సులును పూర్తి చేసిన వారు నర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.

10+2 కోర్సులను కంప్లీట్ చేసి, నిమిషానికి 30 ఇంగ్లీష్ / 25 హిందీ పదములు టైప్ చేసే సామర్ధ్యం, కంప్యూటర్ ప్రోఫీషియన్సీ కోర్సులను పూర్తి చేసిన వారు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 సంబంధిత విభాగాలలో ఫుల్ టైమ్ రెండు / మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులను కంప్లీట్ చేసిన వారు మెషిన్ మెకానిక్ పోస్టులకు, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు  చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

27 సంవత్సరాలు వరకూ వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుని, తదుపరి హార్డ్ కాపీ లను నిర్ణిత గడువు చివరి తేది లోగా సంబంధిత చిరునామాకూ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 590 రూపాయలు ను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

మిగిలిన కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

వ్రాత పరీక్ష / స్కిల్ / కాంపిటెన్సీ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షణీయమైన భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :

The Joint Director,

National Institute of Fashion Technology,

(NIFT) Campus, Karwar, Jodhpur, pin - 342037.

Website and all Links Apply Link


7) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు, రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై కూ అర్హులే:

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్య అంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3). భారీ స్థాయిలో వేతనాలు.

4). కాంట్రాక్టు బేసిస్ విధానంలో భర్తీ.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అని ఈ నోటిఫికేషన్ లో తెలిపారు.

ఈ ప్రకటనలో పొందుపరిచిన మరిన్ని ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది    :   మే  12, 2022.

విభాగాల వారీగా ఖాళీలు   :

యంగ్ ప్రొఫెషనల్స్  ( జనరల్ మేనేజ్ మెంట్ )   -    50

మొత్తం పోస్టులు  :

50 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ / ఎంబీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా తదితర కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు  :

35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు ఉండే అవకాశం కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ విధానములను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 40,000 నుండి 60,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website and Notification Link

8) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లో వెల్డర్ ఉద్యోగాలు, నెలకు 37,500 రూపాయలు జీతం

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్య అంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.

2). తక్కువ విద్యా అర్హతలుతో పోస్టుల భర్తీ.

3). భారీ స్థాయిలో వేతనాలు.

4). ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

BHEL నుండి వచ్చిన ఈ ప్రకటన గురించి మరింత సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది   :  మే 10, 2022

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేదిలు :  మే 13 మరియు మే 15, 2022.

విభాగాల వారీగా ఖాళీలు :

వెల్డర్ ( ఫిక్స్డ్ టెన్యూర్ అపాయింట్మెంట్ )   -    75

మొత్తం పోస్టులు :

75 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన బోర్డుల నుండి ఐటీఐ, (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ) ప్లస్ క్వాలిఫైడ్ బాయిలర్ వెల్డర్స్ సర్టిఫికెట్ లు కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

35 సంవత్సరాలు వయసు వరకూ కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీల అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో మొదట దరఖాస్తు చేసుకోవలెను. తదుపరి దరఖాస్తుల హార్డ్ కాపీ లను సంబంధిత అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదిలోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

200 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ ను దరఖాస్తు ఫీజులుగా అభ్యర్థులు చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతలు మరియు అనుభవం, స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 37,500 రూపాయలు జీతం, మరో 10,000 రూపాయలు వరకూ ఇన్సెంటివ్స్, మెడికల్ బెనిఫిట్స్ తదితర సౌకర్యాలు లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :

Sr. Deputy General Manager ( HR ),

BHEL, Power Sector Western Region,

Shree Mohini Comples, 345 Kingsway,

Nagpur - 440001.

Website

Notification

10) ఉద్యోగాల భర్తీపై SSC కీలక ప్రకటన, అస్సలు మిస్ కావద్దు

భారత దేశ వ్యాప్తంగా గడిచిన నెల ఏప్రిల్ 11, 2022 నుండి ఏప్రిల్ 21, 2022 వరకూ జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, 2021  టైర్ -1 పరీక్షల యొక్క తాత్కాలిక   జవాబు కీ లను తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచినట్లుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తాజాగా  తెలిపింది.

ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ టైర్ - 1 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి,  ఓపెన్ కాగానే తమ తమ రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడీ మరియు పాస్ వర్డ్ లతో ఈ పరీక్షల ఆన్సర్ కీ లను చూసుకోవచ్చు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా విడుదల చేసిన ఈ కీ లపై అభ్యర్థులు ఏమైనా సందేహాలు ఉంటే మే 2, 2022 నుండి మే 7, 2022 సాయంత్రం 5 గంటల వరకూ 100 రూపాయలును చెల్లించి రిప్రెసెంటేషన్ లను కూడా ఇవ్వవచ్చు అని ఈ ప్రకటన ద్వారా ఎస్ఎస్సీ అభ్యర్థులకు తెలిపింది.

అంతే కాకుండా అభ్యర్థులు పరీక్షలు వ్రాసిన  తమ తమ  రెస్పాన్స్ షీట్స్ ను కూడా ప్రింట్ అవుట్ లను తీసుకోవచ్చు అని కూడా ఈ ప్రకటన ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తెలిపింది.

11) పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 1,20,000 రూపాయలు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం

సివిల్స్, రైల్వే మరియు ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాట్, మ్యాట్, గేట్, జేఈఈ, నీట్ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ మరియు ప్రతి నెల స్టై ఫండ్స్ ను ఇవ్వడానికి గానూ, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా భారతీయ కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినట్లుగా తెలుస్తుంది.

ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్య అంశాలు  :

1). 2022-23 సంవత్సరంలో మొత్తం 3500 మందికి ఈ శిక్షణను ఇవ్వనున్నారు.

2). ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులకు 40 శాతం సీట్లు, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు 60 శాతం సీట్లను కేటాయిస్తారు.

3).8 లక్షల రూపాయలు లోపు కుటుంబ ఆదాయం ఉన్న ఎస్సీ, ఓబీసీ లు అర్హులుగా తెలిపారు.

4).ప్రతీ నెల 4000 రూపాయలు స్టై ఫండ్స్ ను ఇవ్వనున్నారు.

5).ఫీజును చెల్లించి రసీదులను సమర్పిస్తే అభ్యర్థులు కట్టిన ఫీజును రీయింబర్స్ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు  :

నోటిఫికేషన్ విడుదల తేది             :  మే 1, 2022

దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది   :  మే 31, 2022

ఎంపిక జాబితా విడుదల తేది        :  జూన్ 5, 2022

ఎలా అప్లై చేసుకోవాలి:

ఫ్రీ కోచింగ్ స్కీం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

విభాగాల వారీగా కేంద్రం అందించే ఆర్థిక సహాయం :

సివిల్స్ :

సివిల్స్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు 9 నెలల కోచింగ్ కు గానూ 1,20,000 రూపాయలు.

ఎస్ఎస్సీ/ఆర్ఆర్బీ :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు రైల్వే పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు 6 నెలల కోచింగ్ కు 40,000 రూపాయలు.

బ్యాంకింగ్ / ఇన్సూరెన్స్ :

బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ పరీక్షలకు ఆరు నెలలకి 50,000 రూపాయలు.

జేఈఈ /నీట్ :

జేఈఈ మరియు నీట్ టెస్ట్ లకు కోచింగ్ తీసుకునే వారికి 9 నెలలకు 80,000 రూపాయలు.

ఐఈఎస్ :

ఐఈఎస్ శిక్షణ తీసుకునే వారికి 80,000 రూపాయలు.

క్యాట్ / మ్యాట్ :

క్యాట్ మరియు మ్యాట్ లకు కోచింగ్ తీసుకునే అభ్యర్థులకు 60,000 రూపాయలు.

జీఆర్ఈ/జీమ్యాట్ లకు సన్నద్ధం అవుతున్న వారికి మూడు నెలలకు 35,000 రూపాయలు.

గేట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 9 నెలల కోచింగ్ కు 75,000 రూపాయలు.

సీపీఎస్ కోర్సు తీసుకున్న వారికి ఆరు నెలలకు గానూ 30,000 రూపాయలు.

ఎన్డిఏ / సీడిఎస్ కోచింగ్ కు మూడు నెలల కోర్సులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయంను భారతీయ కేంద్ర ప్రభుత్వం తరుపున అభ్యర్థులకు అందనున్నట్లుగా తెలుస్తుంది.

ఒక వేళ పైన తెలిపిన ఫీజుల కంటే అధిక ఫీజులు కట్టవలసి ఉంటే ఆ మిగతా ఫీజులను సదరు అభ్యర్థులే భరించవలసి ఉంటుందని వస్తున్న వార్తలు ద్వారా సమాచారం  మనకు తెలుస్తుంది.

12) UGC NET 2022 పై అతి ముఖ్యమైన ప్రకటన

ఫ్లాష్ న్యూస్, యూజీసీ నెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల, షేర్ చేయండి.

జూనియర్ రీసెర్చ్ ఫెలో (జెఆర్ఎఫ్) మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు గానూ అర్హత కోసం నిర్వహించబడే యూజీసీ నెట్ పరీక్ష 2022 కు సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ఈ సారి   డిసెంబర్ 2021 మరియు జూన్ 2022 లకు సంబంధించిన ఎంట్రన్స్ పరీక్షలను ఒకే సారి నిర్వహించనున్నారు.

ఆన్లైన్ విధానంలో ఈ నెట్ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి అని ప్రకటనలో తెలిపినట్లుగా మనకు తెలుస్తుంది.

యూజీసీ నెట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది   :  ఏప్రిల్ 30, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది         :   మే 20, 2022

13) IRCON లో ఉద్యోగాల భర్తీ అస్సలు మిస్ కాకండి

మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ,ఇర్కాన్ లో 36,000 రూపాయలు వరకూ జీతం, వెంటనే అప్లై చేసుకోండి, అస్సలు మిస్ కావద్దు.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఉన్న ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాల  భర్తీకి సంబంధించిన ఇంపార్టెంట్  నోటిఫికేషన్ విడుదల అయినది.

ముఖ్య అంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే విభాగానికి చెందిన ఉద్యోగాలు.

2). భారీ స్థాయిలో జీతములు లభించనున్నాయి.

3). కాంట్రాక్ట్ బేసిస్ లో పోస్టుల భర్తీ జరుగనుంది.

 ఈ కేంద్ర ప్రభుత్వ  రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన  పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ ఉద్యోగాల భర్తీకి  సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారంను మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది                                    :   మే 9, 2022

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది   :   మే 16, 2022

విభాగాల వారీగా ఖాళీలు :

ఫైనాన్స్ అసిస్టెంట్       -      8

హెచ్. ఆర్. అసిస్టెంట్  -      5

ఐటీ ఇంచార్జ్               -     3

మొత్తం పోస్టులు   :

16 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సీఏ/సీఎంఏ ఇంటర్మీడియట్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఫైనాన్స్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రెండు సంవత్సరాల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ /డిప్లొమా ఇన్ హెచ్. ఆర్ /పర్సనల్ /ఐఆర్/పీఎం&ఐఆర్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు హెచ్. ఆర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఐటీ /కంప్యూటర్ సైన్స్ కోర్సులను పూర్తి చేసిన వారు ఐటీ ఇంచార్జ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

విభాగాలను అనుసరించి 35 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్  ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

మొదట ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను. తదుపరి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్స్ ఫారం ను ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదిలోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీలను  అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 36,000  రూపాయలు  ఫిక్స్డ్ పే జీతం లభించనుంది.

భారీ స్థాయిలో లభించే ఈ జీతములతో పాటు ఏన్యువల్ ఇంక్రిమెంట్ 2000 రూపాయలు మరియు ఇతర అలోవెన్స్ +ఐడిఏ వంటి బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా (అడ్రస్ ) :

JGM/HRM, Ircon international Ltd,

C-4, District Centre, Saket, New Delhi - 110017.

Notification

Website

14) DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు, జీతం 31,000 రూపాయలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు చెందిన,  డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ (DRDO) ఆధ్వర్యంలో ఉన్న ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్, బెంగళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (జెఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్య అంశాలు  :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

డీఆర్డీఓ, బెంగళూరు నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ఇంపార్టెంట్ అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది    :   మే 2, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది          :   మే 22, 2022

పరీక్ష నిర్వహణ తేది                           :   జూన్ 14, 2022

ఇంటర్వ్యూ నిర్వహణ తేది                  :  జూన్ 15, 2022

వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం  :

ADE, DRDO, Raman Gate, Suranjandas Road, New Thippasandra Post, Bangaluru - 560075.

పోస్టులు - వివరాలు :

జూనియర్ రీసెర్చ్ ఫెలో     -     9

విభాగాల వారీగా ఖాళీలు  :

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్    -   5

ఏరోనాటికల్ ఇంజనీరింగ్                              -  2

మెకానికల్ ఇంజనీరింగ్                                 -  2

మొత్తం పోస్టులు  :

9 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో మొదటి శ్రేణిలో  బీ.ఈ/బీ. టెక్ /ఎం. ఈ/ఎం. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి వాలీడ్ గేట్ స్కోర్ అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు  :

28 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 31,000 రూపాయలు జీతం మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA)లు లభించనున్నాయి.

Apply Link

Notification

15) Ministry of Defence DEBEL Jobs 2022

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిఫెన్స్ ఆర్ & డీ ఆర్గనైజషన్ (డీఆర్డీఓ) సంస్థ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ & ఎలక్ట్రో మెడికల్ లేబర్యాటరీ (DEBEL) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్య అంశాలు  :

1). ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు చెందిన అప్ప్రెంటీస్ షిప్ పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై కు అర్హులే.

3). ఆకర్షణీయమైన స్టై ఫండ్స్.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.

డీఆర్డీఓ సంస్థ నుండి వచ్చిన ఈ ప్రకటన గురించి మరింత సవివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ ఈ మెయిల్ దరఖాస్తులకు చివరి తేది  :  ప్రకటన వచ్చిన 15 రోజుల లోపు..

పోస్టులు - వివరాలు  :

గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ షిప్ ట్రైనీ    -   20

విభాగాల వారీగా ఖాళీలు   :

మెకానికల్                  -    6

ఎలక్ట్రానిక్స్ /ఈ & సీ   -   6

బయో - మెడికల్          -   6

కంప్యూటర్ సైన్స్ / ఐటీ -   2

మొత్తం ఖాళీలు   :

20 ఖాళీలను తాజాగా విడుదల చేసిన ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బీ.ఈ /బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ షిప్ ట్రైనీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు  :

ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

మొదట ఈ క్రింది లింక్ లో ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

తరువాత సంబంధిత వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకుని, నింపిన అప్లికేషన్ ఫారంనకు, విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి, పీడీఎఫ్ రూపంలోనికి మార్చి, ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదిలోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతల మార్కులు, షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ విధానములను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 9000 రూపాయలు స్టై ఫండ్స్ లభించనున్నాయి.

Registration Link

Email address

hrd.debel.debel@gov.in

Website 

16) APPSC AE 190 ఉద్యోగాల పై అతి ముఖ్యమైన ప్రకటన :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇంజనీరింగ్ సర్వీసెస్ డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న సుమారుగా 190 అసిస్టెంట్ ఇంజనీర్స్( ఏఈ ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ను తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది.

ఈ 190 అసిస్టెంట్ ఇంజనీర్స్ (AE)పోస్టుల భర్తీకి గత సంవత్సరంలో నోటిఫికేషన్ విడుదల అయినది. ఈ నెల అనగా మే 14 మరియు 15 వ తేదీలలో రెండు రోజుల పాటు  ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.

ఈ పోస్టుల భర్తీకి నిర్వహించబోయే ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ను తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచినట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ను క్లిక్ చేసి మీ మీ పరీక్షల హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ లో గ్రూప్ - 4 మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పరీక్ష ఎప్పుడు: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఏడాది 2021 డిసెంబర్ నెలలో విడుదల చేసిన 670 రెవిన్యూ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు 60 ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీనకు నోటిఫికేషన్స్ విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే.

అయితే, నోటిఫికేషన్స్ విడుదల అయ్యి ఐదు నెలల కాలం  పూర్తి అయినా గానీ, ఇప్పటి వరకూ కూడా ఈ 670 గ్రూప్ 4 మరియు 60 ఈఓ పోస్టుల భర్తీనకు నిర్వహించవల్సిన ప్రిలిమ్స్ పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించకపోవడంతో, ఈ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  సుమారు 6 లక్షల మంది అభ్యర్థుల మనస్సులలో ఈ పోస్టుల భర్తీపై అనేకానేక సందేహాలు నెలకొని ఉన్నాయి.

ఈ నేపథ్యంలో, 730 పోస్టుల భర్తీనకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సన్నాహాలును చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

మనకు అందుతున్న సమాచారం మేరకు, మే 31, 2022 లేదా జూన్, 2022  మొదటి వారంలో గ్రూప్ 4 మరియు ఈఓ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షల తేదీల షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

2022, జూలై నెల చివరి వారం నుండి ఆగష్టు మొదటి వారం లోపు గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షలు జరుగనున్నట్లుగా తెలుస్తుంది.

ఈ పరీక్షలకు సంబంధించిన  షెడ్యూల్ ను   ఏపీపీఎస్సీ అధికారికంగా  విడుదల చేసిన వెంటనే మన వెబ్సైటు ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తాము. కావున, అభ్యర్థులు ప్రతీరోజు మన వెబ్సైటు ను వీక్షించగలరు.

ఏపీ లో గ్రూప్ 1,2 నోటిఫికేషన్ల విడుదలపై మరియు గ్రూప్-4, ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్ష తేదీలపై క్లారిటీ  Click Here

యూజీసీ నెట్ -2022 నోటిఫికేషన్ విడుదల Click Here

సమగ్ర శిక్ష అభియాన్ (SSA) ఉద్యోగులకు తిరిగి మరలా జాబ్స్ లోనికి Click Here

ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,05,000 రూపాయలు Click Here

Post a Comment

0 Comments