ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో కేవలం 10వ తరగతి మాత్రమే అర్హతలుతో, ఉన్న సొంత ఊరిలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఒకే ఒక మంచి సువర్ణ అవకాశంను ఇండియన్ పోస్టల్ శాఖ నుండి తాజాగా వచ్చింది.
పోస్ట్ ఆఫీస్ లో గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పేరుతో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM) మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) అనే రెండు కేటగిరీ ల ఉద్యోగాలను ఇరు తెలుగు రాష్ట్రాలలో 10వ తరగతి చదువుతున్న అభ్యర్థులకు గత నాలుగు సంవత్సరాలు నుండి ఇండియన్ పోస్టల్ డిపార్టుమెంటు కల్పిస్తుంది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం 10వ తరగతి విద్యా అర్హతలో అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కులను అనుసరించి ఈ పోస్టుల భర్తీ జరగనుండడం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు వచ్చిన ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). కేవలం 10వ తరగతి అర్హతలతోనే పోస్టుల భర్తీ.
3).ఏ విధమైన పరీక్షలు లేవు.
4). లోకల్ లోనే పోస్టింగ్స్.
5). భారీ సంఖ్యలో భారత దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో 38,926 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చిన ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను సవివరంగా తెలుసుకుందాం. Postal 38,926 Jobs Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : మే 2, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూన్ 5, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / డాక్ సేవక్
తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు :
ఆంధ్రప్రదేశ్ - 1716
తెలంగాణ - 1226
మొత్తం ఖాళీలు :
తెలుగు రాష్ట్రాలలో 2,942 పోస్టల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డుల నుండి మాథ్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతిలో ఉత్తిర్ణత చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
లోకల్ లాంగ్వేజ్ తెలుగుపై నాలెడ్జ్ కలిగి ఉండాలని ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సైక్లింగ్ వచ్చి ఉండాలని ఈ నోటిఫికేషన్ లో తెలిపారు.
వయసు :
18 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 15 సంవత్సరాలు వరకూ వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. అన్ని కేటగిరీల మహిళలకు, ఎస్సీ /ఎస్టీ మరియు దివ్యంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతల మార్కులను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 12,000 రూపాయలు మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం/డాక్ సేవక్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు జీతం అందనుంది.
0 Comments