ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
3). 8వ మరియు 10వ తరగతి విద్యా అర్హతలతో పోస్టుల భర్తీ.
4). ఉన్న ఊరిలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం.
5). ఆకర్షనీయమైన వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలుస్తుంది.
ఎంపికైన అభ్యర్థులకు విజయనగరం జిల్లాల్లో ఉన్న స్థానిక అంగన్వాడీలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. Anganwadi Govt Jobs in AP
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మే 23, 2022 (5 PM).
విభాగాల వారీగా ఖాళీలు :
అంగన్వాడీ కార్యకర్తలు - 10
అంగన్వాడీ హెల్పర్లు - 73
మినీ అంగన్వాడీ హెల్పర్లు - 3
మొత్తం పోస్టులు :
86 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
10వ తరగతి లేదా 8వ తరగతి విద్యా అర్హతలుగా కలిగిన స్థానిక వివహితలు అయిన మహిళా అభ్యర్థులు అందరూ ఈ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ హెల్పర్ మరియు అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు లోపు వయసు కలిగిన మహిళా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆఫ్ లైన్ విధానంలో పూర్తి చేసిన దరఖాస్తు ఫారంనకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి సంబంధిత అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదిలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతల మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు పైన వరకూ నెలకు ఆకర్షణీయమైన జీతములు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి,
విజయనగరం,
ఆంధ్రప్రదేశ్.
0 Comments