ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖలో 14,613 ఖాళీలు ఉన్నట్లుగా భారతీయ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న పోలీస్ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (బీపీఆర్డీ) ఒక నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది.
బీపీఆర్డీ నివేదిక - 2021 నివేదిక ప్రకారం జనవరి 2021 సంవత్సరం నాటికీ ఏపీ రాష్ట్రంలోని అన్ని పోలీస్ విభాగాలలో కలిపి మొత్తంగా 75,365 పోస్టులకు గానూ 60,752 మంది మాత్రమే పోలీస్ డిపార్టుమెంటులో ఉన్నారని తెలుస్తుంది.
బీపీఆర్డీ - 2021 నివేదిక ప్రకారం ఏపీ లో విభాగాల వారీగా ఖాళీగా ఉన్న పోలీస్ శాఖలో పోస్టులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీలు :
కానిస్టేబుల్ - 12,182
ఎస్సై - 505
మొత్తం ఖాళీలు :
పైన తెలిపిన విభాగాలతో పాటుగా మిగిలిన అన్ని విభాగాలలో పోస్టులు అన్నిటిని కలుపుకుంటే ఏపీ పోలీస్ శాఖలో 14,613 పోస్టులు ఖాళీలు ఉన్నట్లుగా బీపీఆర్డి - 2021 నివేదిక తెలిపినట్లుగా ప్రముఖ వార్త పత్రికల కథనముల ద్వారా మనకు తెలుస్తుంది. AP Govt Jobs Update
ఏపీ లో పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ వచ్చేది ఎప్పుడు..?
పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో సుమారుగా 16,000 పోస్టులకు పైబడి పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలైన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కూడా రాబోయే రోజులలో, ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో పోలీస్ పోస్టుల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. కావున ఏపీ లో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీ ప్రిపరేషన్స్ ను మధ్యలో ఆపకుండా, కొనసాగించడం మంచిది అని మనం చెప్పుకోవచ్చు.
0 Comments